డబుల్ కాలనీల్లో వసతులకు రూ.616 కోట్లు

Thu,January 10, 2019 12:50 AM

-నిధుల కోసం ప్రభుత్వానికి లేఖ
- పూర్తయిన ఆరు కాలనీలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : డబుల్ బెడ్ ఇండ్ల కాలనీలకు వివిధ మౌలిక వసతులు కల్పించేందుకు రూ.616 కోట్లు వెచ్చించనున్నారు. ఇండ్లల్లో కల్పించే మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చుకు ఇది అదనం. కాలనీల వరకు మంచినీరు, విద్యుత్ లైన్ల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, అగ్నిమాపక చర్యలు, పోలీస్ ఏర్పాటు తదితర పనులకు వీటిని ఖర్చు చేస్తారు. ఈ మేరకు వివిధ శాఖలకు చెల్లించాల్సిన మొత్తాల జాబితాను రూపొందించిన అధికారులు నిధుల కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు.
నగరంలోని పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ ఇండ్లకు సుమారు రూ.9లక్షలు ఖర్చు చేస్తుండగా, అందులో అంతర్గత మౌలిక సదుపాయాలైన మంచినీరు, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజీ, రోడ్లు తదితర వాటికి దాదాపు రూ. 75 వేలు ఖర్చు చేస్తున్నారు.

అయితే, ఆయా కాలనీల వరకు కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు, మంచినీటి పైప్ ఏర్పాటు, రోడ్ల అనుసంధానం, అవసరమైనచోట కొత్త పోలీస్ ఏర్పాటు తదితర పనుల కోసం అదనంగా రూ.616 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మొత్తాన్ని ఆయా కాలనీలకు చెల్లించాల్సి ఉన్నది. ఇప్పటికే ఆరు కాలనీలు పూర్తి కాగా, మిగిలిన వాటిల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఓ వైపు ఇండ్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో వాటికి కావాల్సిన మౌలిక సౌకర్యాలను కూడా కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

648

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles