ఓటర్ల జాబితా సవరణకు ప్రచారం


Thu,January 10, 2019 12:46 AM

-పేర్ల నమోదుకు విరివిగా ఫెసిలిటేషన్ సెంటర్లు
-కాలేజీల వద్దకు ఈఆర్
-మాల్స్ వద్ద డ్రాప్ బాక్సుల ఏర్పాటు
-జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20, 22, 23, 24వ తేదీల్లో ప్రత్యేక ప్రచార శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ కమిషనర్ ఎం. దానకిశోర్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 20న బీఎల్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండి జాబితాలో పేర్ల నమోదుతోపాటు వివిధ రకాల సవరణలు చేపడుతారని, అలాగే అన్ని వార్డు కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యంతోపాటు కంప్యూటర్ ఏర్పాటు చేసి ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఆపరేటర్ల ద్వారా సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితా సవరణపై బుధవారం జీహెచ్ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఆర్ తమ పరిధిలోని కాలేజీలకు వెళ్లి అర్హులైన విద్యార్థులను ఓటర్ల జాబితాలో చేర్చుతారని తెలిపారు.


అలాగే, ఈనెల 10, 11వ తేదీల్లో సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా పరిధిలోని 84 వార్డు కార్యాలయాల్లో ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, సవరణలు తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు (6, 7, 8, 8ఏ) అందుబాటులో ఉంచుతామన్నారు. అంతే కాకుండా ఈఆర్ కార్యాలయాల్లో కూడా ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే, 11 పెద్ద మాల్స్ సైతం డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేసి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచుతామన్నారు. బీఎల్ గౌరవ వేతనం ఏడాదికి రూ.6 వేలు చెల్లిస్తుండగా, ఆరు రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి అదనంగా మరో రూ.వెయ్యి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను, కాలనీ సంఘాలను పాల్గొనేలా చేసి విజయవంతం చేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

430

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles