లక్ష మందికి ఆరోగ్య రక్ష

Thu,January 10, 2019 12:45 AM

-మెరుగైన వైద్యం..అత్యుత్తమ సౌకర్యాలు
- ప్రైవేటుకు దీటుగా చికిత్సలు
-గతేడాది రికార్డు స్థాయిలో లక్ష 65 వేలమందికి వైద్య సేవలు
-రోగులకు అపద్బంధుగా మలక్ సర్కార్ దవాఖాన
- త్వరలోనే బ్లడ్ బ్యాంక్ ప్రారంభం
- పది కోట్లతోఎంసీ వార్డు నిర్మాణ పనులకూ శ్రీకారం
సైదాబాద్ : తెలంగాణ సర్కారు వచ్చాక ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మారిపోయాయి. ప్రైవేటు వైద్యశాలలను తలదన్నేలా అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మలక్ ఏరియా సర్కార్ వైద్యశాలను కార్పొరేటర్ హంగులతో తీర్చిదిద్దారు. అత్యుత్తమ వైద్యసేవలందిస్తుండడంతో రోగులు క్యూ కడుతున్నారు. గతేడాది రికార్డు స్థాయిలో లక్షకు పైగా రోగులకు వైద్యసేవలందించిందీ వైద్యశాల.
అన్ని సేవలు అందుబాటులో..
నల్గొండ చౌరస్తాలోని ఈ మలక్ ప్రభుత్వ దవాఖానలో అన్ని వ్యాధులతోపాటు, సీజనల్ వ్యాధులతో సంవత్సరం పొడువునా రోగుల వస్తూనే ఉంటారు. నగర శివారు ప్రాంతాలకు చెందిన రోగులకు అందుబాటులో దవాఖాన ఉండడంతో తక్షణ వైద్య సేవలను పొందడానికి ఎక్కువగా వస్తుంటారు. ఏటా పలు రకాల వ్యాధుల బారినపడ్డవారితో పాటు అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన వైద్య, అత్యవసర సేవలను అందుబాటులో ఉండడంతో నిత్యం వందలాదిమంది రోగులు తరలివస్తున్నారు.
రికార్డు స్థాయిలో..
మలక్ ఏరియా దవాఖానలో 2018లో 1,65,079 మందికి వైద్య సేవలు పొందారు. అందులో 10,613 మంది ఇన్ పేషెంట్స్ ఆడ్మిట్ అయి వైద్య సేవలను పొందారు. 1,42,126 మంది తమ రక్త నమూనాల పరీక్షలు చేయించుకున్నారు. ఇది కూడా రికార్డే. యూసీజీ-5,353 మంది, ఎక్స్ మంది, ఈసీజీ-2,301 మంది, ఎండోస్కోపీ-8,372 మంది, ఈఐపీలు- 2,825, మొత్తం కాన్పులు-2,711, శస్త్ర చికిత్సలు-1,191, అత్యవసర శస్త్ర చికిత్సలు -684, పీఎన్ కంటివైద్య పరీక్షలు-530, సిటీ స్కానింగ్-318 మంది చేయించుకున్నారు. రోజుకు 500 నుంచి 800 మంది ఓపీ విభాగంలో వచ్చి చికిత్స పొందుతున్నారు.

822

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles