జాతీయ కవి సమ్మేళనానికి భవానీదేవి

Wed,January 2, 2019 01:23 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆకాశవాణి, ప్రసారభారతి జాతీయ స్థాయిలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రసారం చేసే జాతీయ కవి సమ్మేళనంలో భాగంగా 2019 సంవత్సరానికి తెలుగు కవిగా ప్రసిద్ధ కవయిత్రి డాక్టర్ సి.భవానీదేవి ఎంపికయ్యారు. ఆమె రచయిత్రి, విమర్శకురాలు, ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి విశ్రాంత ప్రభుత్వ ఉప కార్యదర్శిగా ఉన్నారు. సృజన ధుని డాక్టర్ సి.భవానీదేవి అమ్మ నిజం చెప్పదు కవిత ద్వారా ఈ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ నెల 10వ తేదీన చెన్సైలో జరుగనున్న జాతీయ స్థాయి కవి సమ్మేళనంలో ఆమె పాల్గొంటున్నారు. తెలుగులో ఇప్పటికీ 12 కవితా సంపుటులు వెలువరించిన కవయిత్రి భవానీ, వివిధ ప్రక్రియల్లో 46 గ్రంథాలు వెలువరించారు. వీరి పలు కవితలు, కథలు అనేక ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి. భవానీ పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు.

443

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles