మల్టీలెవల్ మార్కెటింగ్ స్కాంలో టీచర్ అరెస్ట్


Mon,October 22, 2018 12:05 AM

-మధ్యప్రదేశ్‌లో 60 వేల మందిని చేర్పించిన ఉపాధ్యాయుడు
-ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు అరెస్ట్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మల్టీలెవల్ మార్కెటింగ్‌తో లక్షలాది మందిని బురిడీ కొట్టించి రూ.3వేల కోట్లను కొల్లగొట్టిన ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ స్కాం కేసులో నిందితుల అరెస్ట్‌ల పరంపర కొనసాగుతుంది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సైబరాబాద్ ఆర్థిక నే రాల నియంత్రణ విభాగం అధికారులు అమాయకులను మోసం చేసి సభ్యులుగా చేర్చిన డిస్ట్రిబ్యూటర్ల అరెస్ట్‌లను కొనసాగిస్తున్నారు. ఆదివారం మధ్యప్రదేశ్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ కైలాష్ చంద్ర ఆర్య అరెస్ట్‌తో ఈ కేసులో అరస్టైన వారి సంఖ్య 5కు చేరింది. ఎఫ్‌ఎంఎల్‌సీ ప్రై వేట్ లిమిటెడ్ కంపెనీ సీఎండీ, ప్రధాన సూత్రధారి రాథేశ్యాం, కంపెనీ జాతీయ స్థాయి డిస్ట్రిబ్యూటర్ సిందర్‌సింగ్, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ వెంకట్‌తో పాటు మరొకరిని ఇది వరకే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా... మధ్యప్రదేశ్‌కు చెందిన కైలాష్ చంద్ర ఆర్య అరెస్ట్ తో మిగతా డిస్ట్రిబ్యూటర్లలో వణకుపుడుతున్నది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కైలాష్ చంద్ర ఆర్య ఎఫ్‌ఎంఎల్‌సీ కంపెనీలో సభ్యుడిగా చేరి... మధ్యప్రదేశ్‌లో దాదాపు 60 వేల మందిని చేర్పించి మల్టీలెవల్ స్కీంలో రాయల్ డైమండ్ స్థానం వరకు ఎదిగి దాదాపు 2.5 కోట్ల కమీషన్‌ను సంపాదించాడు.

దర్యాప్తులో భాగంగా మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీం మోసం అని తెలిసినా, కైలాష్ చంద్ర ఆర్య మాయ మాటలతో భారీ లాభాలంటూ ఆశపుట్టించి సభ్యులను చేర్పించినట్లు సైబరాబాద్ పోలీసులు నిర్థారించారు. ఈ స్కాంలో మరో ప్రధాన నిందితుడు బన్సిలాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ స్కాంలో సైబరాబాద్ పోలీసులు దాదాపు రూ.225 కోట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యూలేషన్ స్కీమ్స్(బ్యానింగ్) యాక్ట్ 1978 ప్రకారం మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్‌ల్లో చేరిన ప్రతి సభ్యుడు నిందితుడు అవుతాడనే విషయాన్ని ప్రతి ఒక్క రూ గుర్తు పెట్టుకోవాలని సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభా గం అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో ఎవరు బాధితులు ఉండరని, వారి డబ్బు సీజ్ చేసినా, అవి కోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వానికి చెందుతాయని వారు వివరించారు. కాబట్టి చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా ఇలాంటి స్కీమ్‌ల్లో చేరవద్దని, మరొకరిని చేరనివ్వకుండా జాగ్రత్తలు సూచించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు. సైబరాబాద్ పరిధిలో ఇలాంటి స్కీమ్‌ల గురిం చి సమాచారం ఉంటే పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఉన్న ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...