వాట్సాప్ గ్రూపులో అనుచిత వ్యాఖ్యలు : కేసులు నమోదు


Sun,October 21, 2018 12:10 AM

- జ్ఞానీజైల్‌సింగ్‌నగర్‌లో ఇద్దరిపై కేసులు
బంజారాహిల్స్, (నమస్తే తెలంగాణ): వాట్సాప్ గ్రూపులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై అసభ్యకరమైన రీతిలో పోస్టింగ్‌లు పెట్టిన ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్‌లోని జ్ఞానీజైల్‌సింగ్‌నగర్‌కు చెందిన స్థానికులు ఓ వాట్సప్ గ్రూపును క్రియేట్ చేశారు. శుక్రవారం రాత్రి అదే బస్తీలో నివా సం ఉంటున్న మల్లేశ్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను కించపరుస్తూ మార్ఫింగ్ చేసిన ఫొటోను పోస్ట్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత అదే బస్తీలో ఉంటున్న డాన్ రాజు కేసీఆర్, కేటీఆర్‌లపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేస్తూ వాయిస్ సందేశాలను పోస్ట్ చేశాడు. బస్తీకి చెందిన పలువురు అభ్యంతరం వ్యక్తం చే సినా వారు పట్టించుకోలేదు. దాంతో బస్తీకి చెందిన విజయలక్ష్మితో పాటు పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...