దివ్యాంగుల పింఛన్ పెంపుపై హర్షం


Sat,October 20, 2018 12:41 AM

బేగంబజార్: టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో దివ్యాంగుల పింఛన్ పెంచుతామని ప్రకటించడంపై టీఎన్జీవో హైదరా బాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌హుస్సేనీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నాంపల్లిలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన ఉద్యోగులను స్వరాష్ర్టానికి,గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలను అందించాలని,ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అన్ని కార్పోరేట్ ఆస్పత్రులలో వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కార్యదర్శి జి ప్రభాకర్, సెంట్రల్ యూనియన్ సెక్రటరీ ఎన్ యాదగిరి రెడ్డి, సహ అధ్యక్షుడు సీహెచ్ వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షులు పి వరదరాజులు,కె దేవేందర్, అయోధ్య తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...