కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ.. చండీ యాగం


Sat,October 20, 2018 12:40 AM

మేడ్చల్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ పార్టీ వంద స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలో శుక్రవారం నవ చండీ యాగం నిర్వహించారు. కర్ణాటకలోని శృంగేరీ శ్రీ శారదా పీఠం జగద్గురువులు శ్రీ భారతి తీర్థ మహాస్వామి శిష్యులు వైభవంగా నిర్వహించిన ఈ యాగంలో ఎంపీ కుటుంబ సభ్యులంతా పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ కష్టపడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ చేయాలని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ వందకు పైగా సీట్లు గెలువడం ఖాయమని, మేడ్చల్ నియోజకవర్గంలో విజయఢంకా మోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్, ఘట్‌కేసర్ జడ్పీటీసీలు శైలజా హరినాథ్, సంజీవరెడ్డి, ఎంపీపీలు చంద్రశేఖర్‌యాదవ్, సుజాత, మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ అంతిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నందారెడ్డి, మండల కన్వీనర్ బలరాంరెడ్డి, మాజీ ఎంపీపీలు శ్యాంరావు, యాదగిరి, సర్పంచ్ చంద్రారెడ్డి, ఎంఎల్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ లక్ష్మణ్‌రెడ్డి, సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, సీఎంఆర్ విద్యాసంస్థల సెక్రటరీ గోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భాగ్యారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, రెడ్డి జేఏసీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాంరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కిశోర్, నాగేశ్ యాదవ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...