రెట్టింపు ఆసరా.. మరింత భరోసా


Wed,October 17, 2018 01:09 AM

-దివ్యాంగులకు పెరిగిన భరోసా
-టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు
-గ్రేటర్‌లో మిన్నంటిన సంబురాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. వికలాంగులు, వృద్ధులు, చేనేత, గీత కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ వరాలు ప్రకటించడంపై గ్రేటర్ పరిధిలో సంబరాలు మిన్నంటాయి. టీఆర్‌ఎస్, వివిధ వర్గాలు మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు గులాబీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకొని ర్యాలీలు నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ప్రధానంగా పింఛన్‌ను రెట్టింపు చేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. పింఛన్ల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గించడం, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక నిధి, రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటు చేసి పేదల


ను ఆదుకోవడం తదితర అంశాలు ప్రకటించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాదీలంతా తెలంగాణ బిడ్డలె
హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ నాలుగేండ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని, హైదరాబాద్‌లో ఉండే వాళ్లందరూ తెలంగాణ బిడ్డలే అని మరోసారి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో చాలా మాట్లాడారని, కానీ నవ్విన నోళ్లు ఈ రోజూ మూతపడ్డాయన్నారు. అలాగే చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 12 కార్పొరేటర్ స్థానాలు, తాజా శాసనసభ ఎన్నికల్లో ఏడు స్థానాలను ఇతర ప్రాంతాలకు చెందిన వారికే కేటాయించామన్నారు.

అన్నదాతకు చేయూత
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన పాక్షిక మ్యానిఫెస్టోలో అన్నదాతలకు వరాలు ప్రకటించారు. రైతును రాజును చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి ఇస్తుండటంతో రానున్న రెండేండ్లలో అన్నదాతలందరు అప్పుల ఊబినుంచి బయటకువస్తారన్నారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.8వేలు ఉన్న పంట పెట్టుబడిని రూ.10 వేలకు పెంచారు. రైతు సమన్వయ సమితిల ప్రతినిధులకు గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించడంతో జిల్లా పరిధిలోని సుమారు 35 వేల మంది రైతులు సంబురపడుతున్నారు

252
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...