వ్యాయామంతోనే రోగాలు దూరం

Mon,October 15, 2018 12:03 AM

-రన్‌ను ప్రారంభించిన బ్రిటిష్ మారథానర్ గవిన్ గ్రీఫిత్
-టైప్ వన్ డయాబెటీస్‌లో పాల్గొన్న చిన్నారులు
మాదాపూర్ : మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన చారిటీ రన్‌లో టైప్ వన్ డయాబెటిస్ బ్రిటిష్ మారథానర్‌కు గవిన్ గ్రీఫిత్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండు రోజులపాటు నిర్వహించనున్న ఐఎస్‌ఎఫ్‌ఏడీ 2018లో భాగంగా 2.5, 5 కిలో మీటర్ల రన్‌ను నిర్వహించారు. ఈ రన్‌లో 350 మంది టైప్‌వన్ డయాబెటిస్ చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవిన్ గ్రీఫిత్ మాట్లాడుతూ... ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొని, రోజు వ్యాయామం చేయాలన్నారు. వ్యాయామంతో మన శరీరంలో అనేక రోగాలు బయటకు వెళ్లిపోతాయన్నారు. హైదరాబాద్‌కు మొట్టమొదటిసారి వచ్చానని, తరువాత ముంబై, ఢిల్లీలో నిర్వహించనున్న మారథాన్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బిర్యానీ చాలా బాగుంటుందని, బిర్యానీ అంటే నాకు ఎనలేని ఇష్టమన్నారు. లండన్‌లో ఎక్కువగా బిర్యానీనే తినేవాడినన్నారు. గోల్కొండ చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. 15మంది నిపుణులతో బృందంగా ఏర్పడి తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. పాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేయాలని అలా చేయక పోవడం వల్లనే చిన్నారుల్లో డయాబెటిస్ వస్తుందన్నారు. శస్త్ర చికిత్స ఉందా, మార్పిడి చేయవచ్చా అనే ప్రశ్నకు సమాధానంగా శస్త్ర చికిత్స మంచిదేనని, మార్పిడి వల్ల సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. పాంక్రియస్ ఉత్పత్తిలో బ్లడ్ లెవల్స్ సమతుల్యం అవుతాయన్నారు. ఐఎస్‌ఎఫ్‌ఏడీ ప్రతినిధులు, నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

354
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles