చిలువేరు ఒడిస్సీ ఆర్ట్ ప్రదర్శన

Sun,October 14, 2018 11:57 PM

నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో : తెలంగాణ కళాకారుడు, వరంగల్ వాసి చిలువేరు మనోహర్ తయారు చేసిన ఒడిస్సీ ఆర్ట్ ప్రాజెక్టును 2017లోనే ప్రారంభించారు. ఇందులో భాగంగా (ఈజిప్టు) కైరో నగరంలో ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా జరగనున్న ఒక ప్రత్యేక చిత్రకారుల వేడుకలో ప్రదర్శించడానికి ఆహ్వానం లభించింది. ఈ నెల 30న తన ఆర్ట్ వర్క్స్‌ను కైరో డినాల్లే వేడుకలో ప్రదర్శించే అవకాశం ఇండియాలో ముగ్గురికి రాగా, అందులో తెలంగాణ నుంచి మన మనోహర్ ఒకరుగా ఉన్నారు. కైరో ఫెస్టివల్‌లో 25 దేశాల నుంచి చిత్రకారులు పాల్గొంటున్నారు. ఈ ప్రదర్శనలో మూడు రోజుల పాటు మనోహర్ తన రెండు ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఈ ఒడిస్సీ ఆర్ట్ ప్రాజెక్టును గురించి జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణా కే్రందంలోని పీవీఆర్కే ప్రసాద్ హాల్‌లో ఆదివారం ఉదయం 10:30 గంటలకు మరో ప్రారంభించి పలువురికి చిత్రకళ, శిల్పకళ అంటే ఏమిటి? ఇంకా ఒడిస్సీ ప్రాజెక్టు ఏమిటి? అన్న అంశాలపై విషదీకరించారు. ఈ ప్రత్యేక ఆర్ట్ ఎగ్జిబిషన్, ప్రివ్యూను ఆర్ట్ హిస్టారియన్, క్యూరేటర్ లీనా విన్సెంట్ ప్రదర్శించారు.

170
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles