నగర ఓటర్లు 76,70, 227


Sun,October 14, 2018 01:16 AM

-24 నియోజకవర్గాల్లో ..పెరిగిన ఓటర్లు 2,48,699
-అతి పెద్ద నియోజకవర్గంగా..ఐదున్నర లక్షల ఓటర్లతో శేరిలింగంపల్లి
-అత్యల్ప ఓటర్లు చార్మినార్‌లో.. 1.97 లక్షలు
-హైదరాబాద్ జిల్లా ఓటర్లు 39,60,986
-రంగారెడ్డి జిల్లాలోని బల్దియా పరిధి ఓటర్లు 18,58,177
-మేడ్చల్ జిల్లాలోని బల్దియా పరిధి ఓటర్లు 16,13,205
-పటాన్‌చెరు నియోజకవర్గంలో 2,37,859
-తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల కమిషన్
హైదరాబాద్ జిల్లాలో పెరిగిన ఓట్లు.. లక్ష
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో గడచిన నెల రోజుల్లో ఓటర్ల సంఖ్య 99,977 ఓట్లు పెరిగి 3960986కు చేరుకుంది. ఇందులో పురుషులు 2061274మంది కాగా, మహిళా ఓటర్లు 1899395. థర్డ్‌జండర్ 317ఓట్లు, సర్వీసు ఓట్లు 280 ఉన్నాయి. గత అక్టోబర్ పదో తేదీన విడుదల చేసిన ముసాయిదా ప్రకారం ఓటర్ల సంఖ్య 3861009 కాగా, గడిచిని నెల రోజుల్లో సవరణ సందర్భంగా 150828 కొత్త ఓటర్లు చేరారు. అయితే, ముసాయిదాలో చనిపోయిన, ఇరత ప్రాంతాలకు వెళ్లినవారికి సంబంధించి 51132 ఓట్లను తొలగించడంతో నికరంగా 99977మేరకు పెరిగాయి. కొత్త ఓట్ల చేరిక విషయానికొస్తే, సవరణ సందర్భంగా అత్యధికంగా జూబ్లీహిల్స్‌లో 14460కొత్త ఓట్లు, చార్మినార్‌లో అత్యల్పంగా 5198ఓట్లు చేరాయి. అలాగే, తొలిగింపులో అత్యధికంగా యాకుత్‌పురా నియోజకవర్గంలో 11685ఓట్లను తొలిగించారు. సనత్‌నగర్‌లో అత్యల్పంగా 542ఓట్లు మాత్రమే తొలిగించారు. సర్వీసు ఓట్లు 280 ఉన్నాయి. అంబర్‌పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, యాకుత్‌పుర, సికింద్రాబాద్, కంటోన్మెంట్ స్థానాల్లో 10 వేల నుంచి 13 వేలకుపైగా కొత్త ఓటర్లు చేరగా, యాకుత్‌పుర, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర, గోషామహెల్ తదితరచోట్ల నాలుగు నుంచి 11 వేల వరకు ఓట్లు తొలిగింపునకు గురయ్యాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య 76,70,227 కి చేరింది. గత నెల విడుదల చేసిన ముసాయిదాతో పోల్చితే 2,48,699 ఓట్లు పెరిగాయి. గత నెల 10న విడుదల చేసిన ముసాయిదా ప్రకారం గ్రేటర్ ఓటర్ల సంఖ్య 74,21,528. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 5,49,773 మంది ఓటర్లున్నారు. కోర్ సిటీతో పోల్చుకుంటే శివారు ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. శివార్లలోని 9 అసెంబ్లీ స్థానాల్లోని ఓటర్ల సంఖ్య హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలతో ఇంచు మించు సమానంగా ఉండడం గమనార్హం. హైదరాబాద్ జిల్లాలో 39 లక్షల పైచిలుకు ఓటర్లుండగా, శివార్లలో సైతం 39 లక్షల పైచిలుకు ఓటర్లున్నారు. శివారు ప్రాంతాల్లోని ఉప్పల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ తదితర నియోజకవర్గాల్లో నాలుగు లక్షలకుపైగా ఓటర్లుండడం విశేషం. ఇక థర్డ్ జండర్ల విషయానికొస్తే, హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లోనే తక్కువగా ఉన్నారు. ఇక్కడ 317 మంది మాత్రమే ఉండగా, మేడ్చల్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిథిలో 338 మంది, అలాగే రంగారెడ్డిలోని నాలుగు నియోజకవర్గాల్లో 314మంది ఉన్నారు.

440
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...