రొమ్ము క్యాన్సర్‌ను నివారించొచ్చు

Sun,October 14, 2018 01:03 AM

ఖైరతాబాద్, అక్టోబర్ 13 : ముందస్తుగా పరీక్షలు చేయించుకొని సకాలంలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్‌ను సులభంగా నివారించవచ్చని ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతాకుమారి పేర్కొన్నారు. ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రీజినల్ క్యాన్సర్ కేంద్రం హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన వాక్‌ను శనివారం సంజీవయ్యపార్కు వద్ద నిర్వహించారు. ఈ వాక్‌ను శాంతాకుమారి, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయలత తదితరులు ప్రారంభించారు. ఈ వాక్ సంజీవయ్య పార్కు నుంచి నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ దాకా సాగింది. ఈ సందర్భంగా శాంతాకుమారి మాట్లాడారు. 30ఏళ్లు పైబడ్డ వారు తప్పని సరిగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ పరీక్షలను ఎంఎన్‌జే కాన్యన్సర్ హాస్పిటల్‌లో ఉచితంగా నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి 50 మంది క్యాన్సర్‌ను జయించిన రోగులు స్వచ్ఛందంగా హాజరు కావడం ఇతరులకు స్పూర్తినిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుశీల, శైలజా మోహన్ తదితరులు పాల్గొన్నారు.
స్పర్శ్ హాస్పైస్ సేవలు అభినందనీయం
బంజారాహిల్స్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): వివిధ జబ్బులతో మృత్యువుకు దగ్గరలో ఉన్న వారికి స్పర్శ్ హాస్పైస్ సేవలు చేయడం అభినందనీయమని ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతాకుమారి కొనియాడారు. వరల్డ్ హాస్పైస్, పాలియేటివ్ కేర్ డే సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని స్పర్ష్ హాస్పైస్ కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రోగులు, వారి బంధువులు, సామాజిక కార్యకర్తలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి రోగులను ఉత్సాహపరిచారు. మరింత మందికి సేవ చేసేందుకు 70 పడకల హాస్పైస్ కేంద్రాన్ని నానక్‌రామ్ గూడలో నిర్మిస్తున్నామని, పనులు వేగంగా జరుగుతున్నాయని సంస్థ సీఈఓ రామ్మోహన్‌రావు తెలిపారు. మల్లికార్జున్, ఉస్మానియా మీడియా కళాశాల ప్రిన్స్‌పల్ శశికళ తదితరులు పాల్గొన్నారు.

252

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles