హారతిచ్చి..

Sat,October 13, 2018 01:24 AM

-కేపీ ప్రచారానికి అపూర్వ స్పందన
పేట్‌బషీరాబాద్:కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. ప్రజలు సైతం ఆయనతో పాటే పాదయాత్రగా భాగస్వాములవుతున్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పద్మశాలి సంఘం సభ్యులు వివేకానంద్‌కు మద్దతుగా ఉంటామని వచ్చి ఆయన సమక్షంలో కారు గుర్తుకు ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. వివేకానంద్‌ను గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గండిమైసమ్మదుండిగల్ మండల పరిధి బహదూర్‌పల్లి గ్రామంలో కేపీ వివేకానంద్‌ను గెలిపించాలని ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు, ఎంపీపీ సన్న కవితశ్రీశైలంయాదవ్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నాగరాజుయాదవ్ ప్రచారం చేశారు. పాదయాత్రగా ఇంటింటికి తిరుగుతూ.. డప్పులు వాయిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రచారం చేస్తున్న వీరికి మహిళలు హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ గోపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పడకంటి నవీన్‌కుమార్ గుప్త, టీఆర్‌ఎస్ నాయకులు చింతల దేవేందర్‌యాదవ్, కావలి గణేశ్, మల్లేశ్, నర్సింగరావు, శివ, కుమార్, శ్రీకాంత్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.కాగా, బహదూర్‌పల్లి గ్రామానికి చెందిన 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేపీ వివేకానంద్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేపీ వివేకానంద్‌గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సన్న కవిత, నేతలు నాగరాజుయాదవ్, నవీన్‌గుప్త, గోపాల్‌రెడ్డి, గణేశ్, దేవేందర్‌యాదవ్, మల్లేశ్, నర్సింగరావు, శ్రీకాంత్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అబద్ధాలతో ఓట్లడిగితే ప్రజలే బుద్ధి చెబుతారు
-శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ
కొండాపూర్: కూటములు చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోయేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరని, అబద్ధాలతో ఓట్లు అడిగేందుకు వచ్చే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ పీజేఆర్‌నగర్ కాలనీలో శుక్రవారం గాంధీ కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో కాలనీలో ప్రారంభించిన పలు అభివృద్ధి పనుల పనితీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధికి ఎక్కడా ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకున్న తర్వాతే ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకునే వారు కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపిస్తారన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
-మహేశ్వరం టీఆర్‌ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి
కందుకూరు: రాష్ట్ర అభివృద్ధి టీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మహేశ్వరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం దెబ్బడగూడ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీతో పాటు ఎమ్మ యాదయ్యతో పాటు కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన ఎమ్మ అంజయ్య, నీలం అంజయ్య, ఆర్ వెంకటయ్య, శ్రీశైలం, సాకలి యాదయ్య, చాకలి చంద్రయ్య, బడ్క శ్రీశైలం, అంజయ్య, లక్ష్మయ్య టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రజల మద్దతు ఉన్నంత వరకు తన విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. మాజీ సర్పంచ్ డ్యారంగుల జంగయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు కొలను విజ్ఞేశ్వర్‌రెడ్డి, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మినర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పున్న భిక్షపతి, సీఎసీఎస్ మండల డైరెక్టర్ రాములు నాయక్, యాదయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

యువతకు రోల్‌మోడల్ మంత్రి కేటీఆర్
-ఎల్‌బీనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్
హస్తినాపురం: మంత్రి కేటీఆర్ రాజకీయ రంగంలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించి, తెలంగాణ యువతకు రోల్‌మోడల్‌గా నిలిచారని ఎల్‌బీనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ నుంచి వంద మంది యువత టీఆర్‌ఎస్ యూత్‌వింగ్ నాయకుడు మనీష్‌గౌడ్ ఆధ్వర్యంలో రామ్మోహన్‌గౌడ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన వెంటనే మంత్రి కేటీఆర్ సరళీకృత పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడమే కాకుండా దేశంలో పేరుగాంచిన సాప్ట్‌వేర్‌కంపెనీల అధినేతలతో స్వయంగా మాట్లాడి తెలంగాణలో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పించారన్నారు. దీంతో యువతకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలొచ్చాయన్నారు. కార్యక్రమంలో వినయ్, వాత్సవ్, శిరీష్, యశ్వంత్, అక్షయ్, సాయి, రాకేష్, సురేష్, నీరజ్, మోహన్, సాయి, సూరజ్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సుఖ సంతోషాలతో ప్రజలు
-కంటోన్మెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి సాయన్న
మారేడ్‌పల్లి: టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, రానున్న ఎన్నికట్లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని కంటోన్మెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి జి.సాయన్న అన్నారు. శుక్రవారం మోండా డివిజన్ పరిధిలో వడ్డెరబస్తీ, లేపాక్షికాలనీ, ఎరుకలబస్తీ తదితర ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సాయన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ. ..ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. అనంతరం జి. సాయన్న మాట్లాడుతూ....టీఆర్‌ఎస్‌ను గెలిపించడానికి ప్రజలే ఉత్సాహాంగా ముందుకు వస్తున్నారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మంచిపాలన అందించారని, ఆయన పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల రూప, జీహెచ్‌ఎంసి కో ఆప్షన్ సభ్యుడు సిఎన్. నర్సింహాముదిరాజ్, సంతోష్, సానాధి శ్రీనివాస్, టీఎన్. శ్రీనివాస్, కసిరెడ్డి నరేందర్‌రెడ్డి, నవీన్, మోహన్, ముత్యాలు, మల్లేశ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.


వాకింగ్ చేస్తూ... యోగాసనాలు వేస్తూ..
-బేతి వినూత్న ప్రచారం
ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్, హబ్సిగూడ, ఉప్పల్, తదితర ప్రాంతాల్లో ఉప్పల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బేతి సుభాశ్‌రెడ్డి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఉప్పల్‌లో వాకర్స్‌తో కలిసి నడుస్తూ, యోగాసనాలు వేస్తూ, క్రీడాకారులతో బ్యాడ్మింటన్ ఆడుతూ ఓట్లు అభ్యర్థించారు. టీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలువాలని కోరారు. అనంతరం ఉప్పల్‌లో పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బండారి లకా్ష్మరెడ్డి, కార్పొరేటర్ మేకల అనల హన్మంతరెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా మల్లాపూర్‌లో కార్పొరేటర్ బేతి స్వప్నారెడ్డి బేతి సుభాశ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ మేకల అనలా హన్మంతరెడ్డి, గోపు సదానంద్, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, అన్య బాలకృష్ణ, పల్లె నర్సింగరావు, మొట్టె రమేశ్, జెల్లి మోహన్, చింతల నర్సింహారెడ్డి, తవిడబోయిన గిరిబాబు, మేకల మధుసూదన్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, అరిటికాయల భాస్కర్, కొండ్ర హన్మంతు, కొండ్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి నాంది పలకండి
-కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ మాధవరం కృష్ణారావు
బాలానగర్: టీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి - అభివృద్ధికి నాంది పలకండి అంటూ కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు బోనాలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. ఇందిరాగాంధీపురంలో ప్రారంభమైన ర్యాలీ శివశంకర్‌నగర్, నాగార్జునకాలనీ, గౌతంనగర్, శోభనకాలనీ, పైప్‌లైన్‌రోడ్డు, హరిజనబస్తీ, జింకలవాడ, సమతానగర్, ప్రభాకర్‌రెడ్డినగర్, భరత్‌నగర్, జేపీనగర్, ఎస్పీనగర్ వరకు కొనసాగింది. అనంతరం మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఫతేనగర్ డివిజన్ అభివృద్ధికి కోట్లాది నిధులు కేటాయించినట్లు తెలిపారు. డివిజన్ మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భిక్షపతి, సీనియర్ నాయకులు కె. రాములు, భగవంత్‌రెడ్డి, ఇమ్రాన్, ఎండీ నసీర్, దత్తారావు, సాగర్‌రావు, వెంకటేశ్ ముదిరాజ్, బాలకృష్ణ, ఖాదర్, శిల్ప, ఉమ, జ్యోతి, కృష్ణకుమారి పాల్గొన్నారు.

కష్టపడి పనిచేయండి..టీఆర్‌ఎస్‌ను గెలిపించండి
-మాజీ మంత్రి దానం నాగేందర్
బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత దానం నాగేందర్ సూచించారు. ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని మహాభారత్‌నగర్ బస్తీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సత్తయ్య, రాజుతో పాటు పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికిన దానం నాగేందర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు మంచి విజయం ఖాయమని పేర్కొన్నారు. కాగా, మాజీ మంత్రి దానం నాగేందర్‌కు దానం నాగేందర్‌ను తెలంగాణ మాలల సమితి అధ్యక్షుడు బరిగెల వెంకటస్వామితోపాటు పలువురు సమితి సభ్యులు కలిసి మద్దతు పలికారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని బలపరుస్తామని బరిగెల పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు బాబా నాయక్, రాములు చౌహాన్, అశోక్, ఆంథోనీ పాల్గొన్నారు.

317
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles