అమీర్‌పేట టు హైటెక్‌సిటీ.. విద్యుత్ పనులు పూర్తి

Fri,October 12, 2018 12:51 AM

-పూర్తికావస్తున్న మెట్రో కారిడార్-3
-తుది దశలో కారిడార్-2 మొదటి దశ పనులు
-త్వరలో హైటెక్‌సిటీ, ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్‌కు మెట్రో
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మెట్రోమొదటి దశ దాదాపు పూర్తికావస్తుంది. మూడు కారిడార్ల ప్రాజెక్టులో కారిడార్1 మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఆపరేషన్స్ ప్రారంభమై ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, కారిడార్ 3లో భాగంగా ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. కారిడార్3లో అమీర్‌పేట్ నుంచి హైటెక్‌సిటీ వరకు పెండింగ్‌లో ఉన్న 10 కిలోమీటర్ల మార్గం కూడా దాదాపు సిద్ధమైంది. జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గం కారిడార్ 2లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు దాదాపు పనులన్నీ పూర్తయ్యాయి. కేవలం ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా పనులు సర్వే జరుగుతున్నది.

అతి త్వరలో మొదటిదశ మెట్రోరైలులో భాగంగా నిర్మిస్తున్న హైటెక్‌సిటీ వరకు త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కానుండగా, ఎంజీబీఎస్ వరకు కొద్ది నెలల్లో ఆపరేషన్స్ ప్రారంభమవుతాయి. ఇప్పటికే అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ మా ర్గంలో విద్యుత్ పరీక్షలు నిర్వహించారు. ట్రాక్‌తోపాటు సిగ్నలింగ్ పనులు ఇప్పటికే పూర్తికాగా స్టేషన్లు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. కారిడార్2లో 9 స్టేషన్లు ప్రతిపాదించగా 9 స్టేషన్లు పూర్తయ్యాయి. ఇప్పటికే 94.9శాతం పనులు పూర్తయ్యాయి.
hyd

2101
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles