ఫేషియల్ రికగ్నిషన్ యాప్ సక్సెస్

Fri,October 12, 2018 12:48 AM

వివరాల్లోకి వెళితే..
6 నెలల క్రితం సరూర్‌నగర్ ప్రాంతంలో మగాని చంద్రమ్మ (70)దయనీయంగా తిరుగుతూ కనిపించింది. దీంతో పోలీసులు ఆమెను సరూర్‌నగర్ చౌడీ ప్రాంతంలోని జీహెచ్‌ఎంసీ ఆశ్రయంలో చేర్పించారు. ఇటీవల ఎస్పీఓ వంశీకృష్ణ ఆమె పరిస్థితిని చూసి వృద్ధురాలిని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రయత్నంలో చంద్రమ్మ ఫొటో తీసి షేషియల్ రికగ్నిషన్ యాప్‌లో డయల్ 100 పీసీ మన్మధరావు సహకారంతో గాలించారు. దీంతో ఆ వృద్ధురాలు అదృశ్యమైనట్లు మీర్‌పేట్ పీఎస్‌లో క్రైం.నంబరు 235/2018 ఫిర్యాదు నమోదైనట్లు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని మీర్‌పేట్ పోలీసులకు సమాచారం ఇచ్చి చంద్రమ్మ మనుమడిని పిలిపించి అప్పగించారు. ఈ విధంగా ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ద్వారా వృద్ధురాలిని వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన సిబ్బందిని సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో మంచి ఫలితాలు
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ద్వారా బాలాపూర్ వద్ద ఓ నేరస్థుడిని, మీర్‌పేట్ పీఎస్ పరిధిలో ఏడాది కిందట తప్పిపోయిన బాలుడిని, నాచారం పీఎస్ పరిధిలో తప్పిపోయిన ఓ వ్యక్తిని కూడా వారి ఇంటికి చేర్చారు. ఇలా ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ మిస్సింగ్ కేసులలో పోలీసులకు చాలా ఉపయోగపడుతుంది. దీంతో రాచకొండ ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది విధుల్లో ఉండే పోలీసు అధికారులకు ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ పరిశీలనపై శిక్షణ ఇస్తూ వారికి టెక్నాలజీపై పట్టును పెంచుతుంది.

403

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles