10 లక్షలు దాటిన కంటి పరీక్షలు


Thu,October 11, 2018 01:10 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్‌లో కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా సాగు తున్నది. 30సర్కిళ్ల పరిధిలో బుధవారం నాటికి 1049718మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. సగటున 67శాతం మందికి పరీక్షలు నిర్వహించగా, సర్కిల్ యావరేజి 29992గా నమోదైంది. అలాగే వార్డు యావరేజ్ 200గా ఉంది. కాగా, అక్టోబర్ 10వ తేదీన 24017మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. ఇందులో 4912మందికి కంటి అద్దాలు పంపిణీచేయగా, 1253మందికి శస్త్రచికిత్సలు జరిపేందుకు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. జోన్లవారీగా చూస్తే, చార్మినార్ జోన్‌లో 5979, ఎల్బీనగర్‌లో 3858, ఖైరతాబాద్‌లో 3596, శేరిలింగంపల్లిలో 2363, సికింద్రాబాద్ 3661, కూకట్‌పల్లి జోన్‌లో 4560 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.

177
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...