మంత్రి కేటీఆర్‌ను కలిసిన యాకుత్‌పురా అభ్యర్థి

Fri,September 21, 2018 12:41 AM

సైదాబాద్, నమస్తే తెలంగాణ: యాకుత్‌పురా నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి సామ సుందర్ రెడ్డి గురువారం మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవనంలో కలిశారు. ఈ సందర్భంగా పాతబస్తీలోని యాకుత్‌పురా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం, గెలుపు, స్థానిక పరిస్థితులు, పార్టీ కార్యకర్తల, నాయకుల పనితీరు లాంటి అంశాలపై కేటీఆర్‌తో చర్చించినట్లు సామ సుందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పాతబస్తీ కోసం చేపట్టిన అభివృద్ధి పనులు, మైనార్టీ ప్రజల సంక్షేమ కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లానని మంత్రి కేటీఆర్ సూచించారని ఆయన తెలిపారు. డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పథకాలను, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రచారం చేయటడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని, అదే విధంగా పాతబస్తీలో టీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేయాలని, పాతబస్తీ నుంచి గెలిచి అసెంబ్లీలో రావాలని సూచించారని ఆయన పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారిలో ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ సామ స్వప్నారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మెట్టు భాస్కర్‌రెడ్డి, గాజుల శివకుమార్ తదితరులు ఉన్నారు.

417

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles