పింఛన్ ఇచ్చిండు.. కేసీఆర్‌కే ఓటేస్తా

Thu,September 20, 2018 02:30 AM

-అభ్యర్థులకు ప్రజల మద్దతు
- వాడవాడలా టీఆర్‌ఎస్ ప్రచారం
-అభివృద్ధికే ఓటర్ల ఆదరణ
సిటీబ్యూరో/అమీర్‌పేట్, నమస్తే తెలంగాణ :పింఛన్ ఇచ్చిండు బిడ్డా, నా యెరుకల గింత సాయం జేయంగా ఎవరిని సూడలే.. కన్న కొడుకులెక్క నెలకు వెయ్యి రూపాలిస్తుండు.. కేసీఆర్‌కే ఓటేస్తా బల్కంపేట బీజేఆర్‌నగర్‌కు చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మ సంతోషంతో చెప్పిన మాటలివి. టీఆర్‌ఎస్ సనత్‌నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మద్దతుగా బుధవారం అమీర్‌పేట్ కార్పొరేటర్ శేషుకుమారి లక్ష్మమ్మను ఓటు అభ్యర్థించగా ఆమె ఇలా స్పందించారు. టీఆర్‌ఎస్ నాయకులు ఎక్కడ ప్రచారం చేసినా ప్రజల నుంచి ఇలాగే సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వారికి కొండంత అండగా నిలుస్తున్నాయి. బుధవారం టీఆర్‌ఎస్ అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న పథకాలపై అవగాహన కల్పించారు. టీఆర్‌ఎస్‌కు ఓటెయ్యాలని కోరారు.

కేటీఆర్‌ను కలిసిన ఉప్పల్ అభ్యర్థి బేతి
ఉప్పల్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బేతి సుభాశ్‌రెడ్డి బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఉప్పల్‌లో టీఆర్‌ఎస్ పరిస్థితి, ప్రచారం, గెలుపు అంశాలపై చర్చించారు. ప్రచారం మరింత ఉధృతం చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారని బేతి తెలిపారు. ఉప్పల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అరిటికాయల భాస్కర్, జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం రవికుమార్, తవిడబోయిన గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.


గాంధీకి అభినందనలు
హైదర్‌నగర్ : టీఆర్‌ఎస్ శేరిలింగంపల్లి అభ్యర్థి అరెకపూడి గాంధీని మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ కాలనీ వాసులు బుధవారం వివేకానందనగర్ డివిజన్‌లోని ఆయన నివాసంలో కలిసి సన్మానించారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ అభివృద్ధి పనులు చేపట్టిన టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఎంతో విశ్వాసం నెలకొందన్నారు.


టీఆర్‌ఎస్ గెలుపుకోసం కృషి చేయాలి
ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ గెలుపుకోసం అందరూ కృషి చేయాలని ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ నాయకుడు వజీర్ ప్రకాశ్‌గౌడ్ అన్నారు. బుధవారం కొత్తపేటలోని తన నివాసంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు వజీర్ ప్రకాశ్‌గౌడ్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వజీర్ ప్రకాశ్‌గౌడ్ మాట్లాడారు.

బౌద్ధనగర్ డివిజన్‌లో..
సికింద్రాబాద్, నమస్తేతెలంగాణ : సికింద్రాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ,మంత్రి టి. పద్మారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు విస్తృత ప్రచారం చేశారు. బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ బైరగోని ధనంజనగౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థించారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలంటే తిరిగి కేసీఆర్‌నే గెలిపించాలన్నారు. టీఆర్‌ఎస్ హయాంలో నగరంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. కారు గుర్తుకే ఓటేయాలని కోరారు.

కేసీఆర్‌ను మరోసారి సీఎంను చేయాలి
ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ: బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌ను మరో సారి సీఎంను చేయాలని ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ కోరారు. బుధవారం నాగోలు డివిజన్‌లో ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్‌కు మద్దతుగా కార్పొరేటర్ చెరుకు సంగీతాపశాంత్‌గౌడ్‌తో కలిసి జైపురికాలనీ సాయిబాబా దేవాలయంలో పూజలు నిర్వహించి, అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

అందరూ ఓటెయ్యాలి
పేట్‌బషీరాబాద్ : ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌లు అన్నారు. గాజులరామారం సర్కిల్ ఎన్టీఆర్ నగర్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నాయకులు, కార్యకర్తల సమావేశానకి వారు ముఖ్య అతిథిలుగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ప్రగతి పరుగులు తీయిస్తున్న టీఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు.


ప్రభుత్వ పథకాలు అద్భుతం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయ్. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టలేదు. తెలంగాణ రాష్ట్ర రూపురేఖలను మార్చేశారు. అభివృద్ధిని కాంక్షించేవారెవరైనా టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాల్సిందే. రాష్ట్రం బంగారు తెలంగాణ కావడానికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నాడు.
-లక్ష్మణ్, నేరేడ్‌మెట్

కల్యాణలక్ష్మి సాయంతో పెండ్లి చేశా
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం నా కుటుంబానికి ఆసరగా నిలిచింది. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి పేదలకు మేలు చేయలేదు. బాకీ చేయకుండా బిడ్డ పెండ్లి చేయడానికి కల్యాణలక్ష్మి ఎంతో ఉపయోగపడింది. కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-మంజుల, యాప్రాల్

అభివృద్ధే గెలిపిస్తుంది
కార్వాన్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని టీఆర్‌ఎస్ కార్వాన్ నియోజకవర్గం అభ్యర్థి ఠాకూర్ జీవన్‌సింగ్ పేర్కొన్నారు. కార్వాన్ డివిజన్‌లోని హీరా నగర్‌లో ఆయన బుధవారం పాదయాత్ర చేపట్టి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌సింగ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.

తీగలకే ఓటేస్తాం
ఆర్కేపురం: టీఆర్‌ఎస్ మహేశ్వరం అభ్యర్థి తీగల కృష్ణారెడ్డికే ఓటేస్తామని కార్యకర్తలు ముక్తకంఠంతో తెలిపారు. బుధవారం ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలోని స్వాగత్ ఫంక్షన్ హాల్‌లో టీఆర్‌ఎస్ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్ ఆధ్వర్యంలో ఆర్కేపురం డివిజన్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తీగల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

టీఆర్‌ఎస్ విజయం సాధించాలని..
చార్మినార్ : టీఆర్‌ఎస్ విజయం సాధించాలని యాకుత్‌పురా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి సామ సుందర్‌రెడ్డి, కార్పొరేటర్ సామ స్వప్నాసుందర్‌రెడ్డి వినాయక మండపంలో పూజలు చేశారు. బుధవారం డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన వినాయక మండపాలను సందర్శించి పూజలు చేశారు.

616

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles