పేద మహిళలకు ఉచిత శిక్షణ

Thu,September 20, 2018 02:18 AM

కాచిగూడ: ఈశ్వర్ వేదాంత్, బిందియా వేదాంత్‌ల ఆధ్వర్యంలో బ్యూటి బోనాంజ-2018 సెమినార్‌ను బుధవారం కాచిగూడలోని వైష్ణావ్ హోటల్‌లో 400 మంది మహిళలతో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రజ్ఞ వేదాంత్ అకాడమి వ్యవస్థాపకురాలు (ముంబై), కాస్మటాలోజి డాక్టర్ ప్రజ్ఞ వేదాంత్ హాజరయ్యారు. ఫేస్ కలరింగ్, మేకప్, హేయిర్‌కటింగ్ తదితర అంశాలపై మహిళ లకు కలిగే ప్రయోజనాలను ఆమె వివరించారు. ఆయా కోర్సులో ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మనస్సు, శరీరం సేద తీరేలా ప్రభావం చేసే చికిత్స లు,మేకప్‌ల వినియోగంపై ఆమె సం పూర్ణ అవగాహన కల్పించారు. అనంతరం వివిధ పోటీలలో ప్రతిబ కనబర్చిన మహిళలకు సర్టిఫికేట్‌లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ వేదాంత్, బిందియా వేదాంత్, పప్పుతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

284

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles