బరువెక్కిన వంతెనలు

Wed,September 19, 2018 12:43 AM

-మందం తగ్గించేందుకు సన్నాహాలు
-4 అంగుళాలకే పరిమితం చేయాలని నిర్ణయం
-మొదటి దశలో మూడు ఎంపిక
-ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదన
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇంజినీర్లు అవలంభిస్తున్న అశాస్త్రీయ విధానాల వల్ల రోజురోజుకూ మందం పెరుగుతూ బరువెక్కుతున్న ైఫ్లెఓవర్లను తేలికపర్చాలని జీహెచ్ ఎంసీ సంకల్పించింది. ఇందులో భాగంగా దశలవారీగా నగరంలోని ైఫ్లెఓవర్ల మందం తగ్గించాలని(స్క్రాపింగ్) చేయాలని నిశ్చయించారు. మొదటిదశలో మాసాబ్‌ట్యాంక్, పంజాగుట్ట, తెలుగుతల్లి తదితర మూడు ైఫ్లెఓవర్లను ఎంపికచేసిన అధికారులు, పనులు చేపట్టేందుకు అనుమతివ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. బీటీకి బదులు సీసీ లేయర్ ఏర్పాటుచేస్తే నిర్వహణ ఖర్చులు తగ్గి ఎక్కువకాలం మన్నే అవకాశముందని, ఆ దిశగా తగు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

నగరంలోని ైఫ్లెఓవర్లు రోజురోజుకూ బరువెక్కుతున్నాయి. ఏటా బీటీ వేసుకుంటూ పోవడంతో చాలా ైఫ్లెఓవర్లపై బీటీ ఎత్తు ఒక అడుగుకన్నా ఎక్కువ పెరిగిపోయింది. దీంతో ైఫ్లెఓవర్‌పై అనవసర బరువు(డెడ్ వెయిట్) పెరిగిపోయి దాని మనుగడ ప్రమా దంలో పడింది. మందం తగ్గిస్తేనే ైఫ్లెఓవర్లు తేలిగ్గా తయారై పదికాలాలపాటు మన గలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు వాటి మందం తగ్గించాలని నిర్ణయించారు. ముందుగా మూడు ైఫ్లెఓవర్ల మందం తగ్గిం చా లని నిశ్చయించిన అధికారులు ఈ మేరకు అనుమతికోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. మందం తగ్గించి ైఫ్లెఓవర్‌ను సాధారణస్థితికి తేవాలంటే కనీసం వారం రోజులు ైఫ్లెఓవర్‌ను మూసివేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అధి కారులు చెబుతున్న వివరాల ప్రకారం, వాహనాల రాకపోకలు సాఫీగా సాగాలంటే ైఫ్లెఓవర్‌పై గరిష్టంగా నాలుగు ఇంచులమేర బీటీ ఏర్పాటుచేస్తే సరిపోతుంది. అయితే నగరంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇంజినీర్లు ప్రమాణాలకు తిలోదకాలిచ్చి అసాస్త్రీయ పద్ధతుల్లో ఒక లేయర్‌పై మరో లేయర్ వేసుకుంటూ పోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతుండడంతో ఒక్కో ైఫ్లెఓవర్‌పై బీటీ దాదాపు పది ఇంచులు దాటిపోయింది. ఇలా టన్నులకొద్ది అవనసర బరువు పెరిగిపోవడం ైఫ్లెఓవర్లకు శ్రేయస్కరం కాదని ఇంజినీరింగు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ైఫ్లెఓవర్లపై డివైడర్‌లు ఏర్పాటుచేయడంతో కొంత బరువు పెరిగాయి. అయితే డివైడర్ల ఏర్పాటుతో ైఫ్లెఓవర్ల మనుగడకు ఎటువంటి ప్రమాదమూ లేదని, మందం కారణంగా ఏర్పడిన అనవసర బరువును మాత్రం తొలగించాల్సిందేనని వారు స్పష్టంచేస్తున్నారు. బరువు పెంచుకుంటూపోతే ైఫ్లెఓవర్ లైఫ్‌లైమ్ తగ్గే అవకాశముందని వారు పేర్కొం టున్నారు. అంతేకాదు, ైఫ్లెఓవర్‌కు ఇరువైపులా టేబుల్ డ్రైన్లు ఒక అడుగుమేరకు ఉండడంతో వాహనాలు వాటిల్లో కూరుకుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి.

మలిదశలో మరికొన్ని...
ఈ నేపథ్యంలో తాజాగా జీహెచ్‌ఎంసీ అధికారులు ైఫ్లెఓవర్ల మందం తగ్గించే అంశంపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా పెరిగిపోయిన బీటీ మందాన్ని పూర్తిగా తొలగించాలని(స్క్రాపింగ్) నిర్ణయించారు. ముందుగా మాసాబ్‌ట్యాంక్, పంజాగుట్ట, తెలుగుతల్లి ైఫ్లెఓవర్ల మందం తగ్గించి అనంతరం మిగిలిన ైఫ్లెఓవర్లను కూడా చేపట్టాలని నిశ్చయించారు. నారాయణగూడ, బషీర్‌బాగ్, ప్యారడైజ్, బేగంపేట్, తార్నాక తదితర ైఫ్లెఓవర్లను మలిదశలో చేపట్టాలని నిశ్చయించారు. ఒక్కో ైఫ్లెఓవర్‌కు కనీసం వారంరోజుల సమయం పడుతుందని, పనులు జరిగేవరకు ైఫ్లెఓవర్‌పై ట్రా ఫిక్‌ను నిలిపివేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మిల్లింగ్ విధానం(రోడ్డు పై పొరను చెక్కడం) దీనికి సరిపోదని, ైఫ్లెఓవర్‌ను మూసివేసి మందాన్ని పూర్తిగా తవ్వి తొలగించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు.

సీసీతో ప్రయోజనాలు...
ైఫ్లెఓవర్లు మందం పెరగకుండా ఉండాలంటే వాటిపై బీటీకి బదులు సీసీ వేయడం మేలని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల నిర్వహణవ్యయం తగ్గడమే కాకుండా పదికాలాలపాటు మరమ్మతుల సమస్య లేకుండా పోతుందని వారు పేర్కొంటున్నారు. సుమారు 20ఏళ్ల క్రితం నిర్మించిన ఖైరతాబాద్ ైఫ్లెఓవర్‌పై అప్పట్లో సీసీ ఏర్పాటు చేశారు. కాగా, రోజువారీ నిర్వహణ పనులు మినహా అది మందం పెరిగిన దాఖలాలు లేవు. అయితే సీసీ ఏర్పాటుకోసం ట్రాఫిక్‌ను నిలిపివేయాల్సి ఉంటుంది.

436

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles