మహాకూటమికి చావు దెబ్బతప్పదు

Tue,September 18, 2018 03:21 AM

బంజారాహిల్స్, (నమస్తే తెలంగా ణ): తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంటూ గొంతు చించుకుంటున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్క కుటుంబం నుం చి ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తే తాను సగం మీసం తీసేసి తిరుగుతానని మాజీ మంత్రి , టీఆర్‌ఎస్ నేత దానం నాగేందర్ సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కునే సత్తా లేక మహాకూటమి అంటూ తెరతీసిన కొత్త నాటకానికి తాజా సర్వేలు చావు దెబ్బ తీశాయని దానం నాగేందర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఖచ్చితంగా 100 సీట్లు వస్తాయని, అపవిత్ర పొత్తుకు సిద్ధమయిన ఏపీ సీఎం చంద్రబాబుకు రెండుచోట్లా ఎదురుదెబ్బ తప్పదని జోస్యం చెప్పారు. సోమ వారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దానం నాగేందర్ మాట్లాడుతూ..ఇటీవల ఆజ్‌తక్-ఇండియా టుడే సర్వేలో టీఆర్‌ఎస్ ్ట ఘన విజయం సాధిస్తుందని తేలిందని, ఫ్లాష్ టీమ్ చేసిన సర్వేలో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తుందని మరోసారి స్పష్టమైందన్నారు. ఆరునెలలుగా అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియా వేదికగా చేస్తున్న ప్రచారాలన్నీ తాజా సర్వేలతో తేలిపోయాయన్నారు. తెలంగాణ ప్రజల మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉం దని సర్వేల్లో స్పష్టమైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక ఇబ్బందులు పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఆదరించి పదవులు కట్టబెట్టారన్నారు.

324

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles