రెవెన్యూ అధికారులకు ఎన్నికల బాధ్యతలు

Tue,September 18, 2018 03:21 AM

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. జిల్లా రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో కీలక బాధ్యతలను నిర్వర్తించనున్నారు. కొంతమంది రెవెన్యూ అధికారులు రిటర్నింగ్ అధికారులుగా, మరికొంతమంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. డిప్యూటీ కలెక్టర్ ఆపై స్థాయి అధికారులు రిటర్నింగ్ అధికారులుగా ఉండనుండగా, తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా పనిచేయనున్నారు. ఈ మేరకు ఆయా వివరాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధంచేసి జీహెచ్‌ఎంసీకి పంపించగా.. అక్కడినుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆమోదానికి వెళ్లింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) కలెక్టరేట్ -మలక్‌పేట, ఆర్డీవో సికింద్రాబాద్-జూబ్లీహిల్స్, హైదరాబాద్ ఎస్టేట్ ఆఫీసర్-నాంపల్లి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్-కార్వాన్,ఆర్డీవో హైదరాబాద్-చాంద్రాయణగుట్ట, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూపరిరక్షణ)-బహదూర్‌పురా

అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు : తహసీల్దార్ షేక్‌పేట,ఖైరతాబాద్ - ఖైరతాబాద్, తహసీల్దార్ అమీర్‌పేట -సనత్‌నగర్, తహసీల్దార్ అంబర్‌పేట -అంబర్‌పేట, తహసీల్దార్ బండ్లగూడ -చాంద్రాయణగుట్ట, తహసీల్దార్ చార్మినార్-చార్మినార్, తహసీల్దార్ బహదూర్‌పురా-బహదూర్‌పురా, తహసీల్దార్ నాంపల్లి-గోషామహల్, తహసీల్దార్ గోల్కొండ-కార్వాన్, తహసీల్దార్ ఆసిఫ్‌నగర్ -నాంపల్లి, తహసీల్దార్ సికింద్రాబాద్,మారేడుపల్లి-సికింద్రాబాద్, తహసీల్దార్ ముషీరాబాద్-ముషీరాబాద్, ఏవో ఆర్డీవో సికింద్రాబాద్-కంటోన్మెంట్, ఏవో ఆర్డీవో హైదరాబాద్-యాకత్‌పురా, తహసీల్దార్ సైదాబాద్-మలక్‌పేట


330

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles