కురుమలకు ప్రాధాన్యత ఇవ్వాలి

Mon,September 17, 2018 12:19 AM

అబిడ్స్,నమస్తే తెలంగాణ: కురుమలు రాజకీయం గా ఎదిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేషం కోరారు. ముస్లింజంగ్ వంతెన వద్ద గల కురుమ సంఘం భవనంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చే సి ప్రసంగించారు. రాష్ట్ర జనాభాలో 45 లక్షల మంది వరకు ఉన్న కురు మలకు చట్ట సభలలో సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలలో ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారని, వారిని గుర్తించి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అన్ని రాజకీయ పార్టీల అధిష్టానాలను కలిసి విన్నవిస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ సీట్ల కేటాయింపు జరగాలని అప్పుడే చట్ట సభలలో ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు.కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ మాట్లాడుతూ కురుమలు అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. అంతకు ముందు కురు మ సంఘం మాజీ అధ్యక్షుడు బట్కిరి దయానంద్ ఇటీవల మృతి చెందడంతో ఆయన సం తాప సభను నిర్వహించారు. కురుమ సంఘం అభివృద్దికి బట్కిరి దయానంద్ చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.ట్రస్ట్ బోర్డు వైస్ చైర్మన్ దేవర రాజేశ్వర్, కురుమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమగొండ రాజేశ్వరరావు, జంట నగరాల కురుమ సంఘం అధ్యక్షుడు బండారి నారాయణ, వస్పరి శంకర్, కెం డ్యాల శ్రీనివాస్, ఎక్కాల కన్నా, బి నాగేష్, కేజీ కృష్ణమూర్తి, కె విజయ్‌కుమార్, తూ ముకుంట అరుణ్ కుమార్, కొరిడె సుదర్శన్‌రావు, తమగొం డ బాలమణి, ఒగ్గు కుమార స్వామి, రెక్కల కొండల్‌రాజ్, కాలె అమర్‌నాథ్‌లతో పాటు వివిధ జిల్లా ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

215

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles