ఓటే వజ్రాయుధం

Mon,September 10, 2018 12:49 AM

శేరిలింగంపల్లి: ఎవరికి ఓటు వేశామని కాకుండా ఓటు హక్కు వినియోగించుకున్నామా లేదా అనేది ప్రధానమని, నేటి యువత ప్రజాసామ్యాన్ని గౌరవించి ఓటుహక్కును సద్వినియోగపరుచుకోవాలని, ఎన్నికలకు దూరంగా ఉండరాదని పలువురు వక్తలు పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినేస్(ఐఎస్‌బీ)లో రెండు రోజులుగా ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్-2018 నిర్వహిస్తున్నారు. రెండవరోజు ఆదివారం ఏర్పాటైన కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆంధ్రప్రదేశ్ ఎంపీ రాంమ్మోహన్ నాయుడు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ స్పీకర్ నాదేళ్ల మనోహార్ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చాగోష్టిలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు కోలువుదీరడం లో యువత కీలకపాత్ర పోషించారన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ధనిక ప్రాం తాలకు చెందిన యువత ఓటింగ్‌కు దూరంగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత నేడు అధిక శాతం తమ ఓటు హక్కును సద్వినియోగపరుచుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీతో సంబంధాలు ఎలా ఉన్న రాష్ట్రంలో మాత్రం టీఆర్‌ఎస్ ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలుస్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదైనప్పటికీ అమలు చేయడంలో విఫలమైందన్నారు.

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ భారత ప్రభుత్వంగా కాకుండా హిందూ ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. గుడులు, గోపురాల చుట్టు రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయని, మోదీ ఎక్కడికి వెళితే రాహుల్ గాంధీ అక్కడకు వెళ్తున్నారన్నారు. మత విశ్వాసాలకు అణుగుణంగా రాజకీయాలు చేస్తున్నారన్నారు. దేశంలో మతపరమైన రాయితీలు వ్యతిరేకిస్తు గతంలోనే హజ్‌కు సబ్సిడీలు ఎత్తివేయాలని లేఖ రాయడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం గంగానది ప్రక్షాళన పేరుతో 4000 కోట్లు ఖర్చు చేసి ఏం సాధించిందని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాదిస్తుందని అన్నారు. దేశంలో గాడితప్పిన ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దిన ఘనత నరేంద్రమోదీదేనన్నారు.

దేశంలో ఏ మూల చిన్న సంఘటన చోటుచేసుకున్న దానిని కేంద్రంపై రుద్ద డం కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు పనిగా పెట్టుకున్నాయన్నారు. దేశ రాజకీయ చరిత్రను గమనిస్తే సంకీర్ణ ప్రభుత్వ ఒరవడి వాజపేయి హయంలోనే ప్రారంభమైందన్నారు. దానిని చూసి కాంగ్రెస్ సం కీర్ణం వైపు అడుగులు వేస్తుందని అన్నారు. మాజీ స్పీకర్ నాదేళ్ల మనోహర్ మాట్లాడుతూ కేంద్రంలో కోలువుదీరిన బీజేపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఇంకా చర్చ ల దశలోనే ఉందన్నారు. ఏపీ ఎంపీ రాంమ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుందన్నారు. రాష్ర్టానికి ఏ పార్టీతో పొత్తు న్యాయమైతే ఆ పార్టీతో ముందుకెళతామన్నారు. ప్రముఖ జర్నలిస్టు టీఎస్ సుధీర్‌తో పాటు పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

308

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles