సృజనాత్మకత పెంచుకోవాలి: జస్టిస్ రాధాకృష్ణన్


Mon,September 10, 2018 12:49 AM

కవాడిగూడ: యువత సృజనాత్మకతను పెంచుకోవాలని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్ సూచించారు. ఆదివారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని రామకృష్ణ మఠంలో వివేకానంద మానవ వికాసం కేంద్రం వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ ఉమ్మడి హై కోర్టు చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి జ్ఞానదానంద తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ రాధాకృష్ణన్ జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన జీవితమే విజయవంతమైన జీవితమన్నారు. యువత అపోహలు పడకుండా శ్రద్ధ, జ్ఞానం పెంచుకొని తమ ప్రతిభను పెంపొందించుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి బీతిహరానంద, స్వామి తీర్ధానంద, తల్లిదండ్రులు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యంలో పాల్గొన్నారు.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...