ఓయూలో గురుపూజోత్సవం

Sun,September 9, 2018 12:44 AM

ఉస్మానియా యూనివర్సిటీ: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో గురు పూజోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల రూం నెంబర్ 57లో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మంది ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులను సన్మానించారు. ఐఆర్‌సీఎస్ - హైదరాబాద్ చైర్మెన్ మామిడి భీంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాజరత్నం, యూజీసీ - హెచ్‌ఆర్‌డీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలకిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదన్నారు. ఇటువంటి పవిత్రమైన వృత్తిలో ఉన్నవారిని సన్మానించుకోవడం అభినందనీయమన్నారు. మామిడి భీంరెడ్డి మాట్లాడుతూ గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను మూడేండ్లుగా సన్మానిస్తున్నామని చెప్పారు.

మానవత్వం, నిష్పాక్షికత, తటస్థత, స్వతంత్రత, స్వచ్ఛంద సేవ, ఐక్యత, విశ్వజనీనత అనే ఏడు ప్రాథమిక సూత్రాల ఆధారంగా రెడ్‌క్రాస్ పనిచేస్తున్నదన్నారు. తమ సంస్థ తరఫున ఈ ఏడాది హైదరాబాద్ జిల్లాలో 54 వేల మంది విద్యార్థులకు ప్రథమ చికిత్సా శిక్షణ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. యూత్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో త్వరలో లక్షమందితో మోటివేషన్ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఐఆర్‌సీఎస్ రాష్ట్ర న్యాయ సలహాదారు ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు డాక్టర్ రాఘవరెడ్డి, ప్రముఖ కవి డాక్టర్ పొద్దుటూరి ఎల్లారెడ్డి, కాంచం ఫౌండేషన్ చైర్మెన్ డాక్టర్ కాంచం సత్యనారాయణ గుప్తా, ఐఆర్‌సీఎస్ - హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి గీతా చౌదరి, డివిజన్ కన్వీనర్లు మహ్మద్ జిలానీపాషా, కిరణ్‌కుమార్‌యాదవ్ హాజరయ్యారు.

230

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles