ఉన్నత విద్యకు జర్మనీ వెళ్లేవారికి సహకారం : మైఖేల్

Sun,September 9, 2018 12:43 AM

కొండాపూర్ : ఉన్నత, పరిశోధన విద్య కోసం జర్మనీ వెళ్లే విద్యార్థులకు అండగా ఉంటామని డిప్యూటీ కౌన్సిల్ ఆఫ్ ది జర్మన్ కాన్సోలేట్ జనరల్ మైఖేల్ వెగెనర్ అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జర్మన్ అకాడమిక్ ఎక్సేంజ్ సర్వీస్ (డీఏఏడీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉన్నత విద్య, పరిశోధనల వివరాల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వర్సిటీ వీసీ అప్పారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మైఖేల్ వెగెనర్ మాట్లాడుతూ జర్మనీలో ఉన్నత, పరిశోధన విద్యలను అభ్యసించాలని ఆసక్తి ఉన్న విద్యార్థులకు అన్ని రకాలుగా డాడ్ సహకరిస్తుందన్నారు. యూనివర్సిటీల వివరాలతో పాటు విద్యాభ్యాసానికి అందించే ఫండ్‌లకు సంబంధించిన పూర్తి సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జర్మనీకి చెందిన వివిధ యూనివర్సిటీల సిబ్బంది సదస్సులో పాల్గొని పూర్తి వివరాలను అందించినట్లు తెలిపారు. దీంతోపాటుగా జర్మన్ లాంగ్వేజ్ తరగతుల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇండో - జర్మన్ విధానం ద్వారా యువ పరిశోధన విద్యార్థుల ఎక్సేంజ్ విధానాలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. యువ పరిశోధన విద్యార్థులకు స్టూడెంట్ లేదా గెస్ట్ సైంటిస్ట్ విసాలు జారీ చేయనున్నట్లు వీసా అధికారి తెలిపినట్లు పేర్కొన్నారు. బిట్స్ పిలానీ హైదరాబాద్ అండ్ డాడ్ అల్యూమినిస్ ప్రొఫెసర్ అరన్య బీ భట్టాచెర్జీ, ప్రొఫెసర్లు, 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

255

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles