అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరుగాలి

Sun,September 9, 2018 12:42 AM

ఉస్మానియా యూనివర్సిటీ : దేశంలో సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరుగాల్సిన అవసరం ఉందని డీఆర్‌డీవో - ఆర్‌సీఐ డైరెక్టర్ బీహెచ్‌వీఎస్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. అప్పుడే సమాజానికి అవసరమైన ఉత్పత్తులు బహిర్గతమవుతాయని చెప్పారు. ఓయూ బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ త్రూ ఇన్నోవేషన్ అనే అంశంపై ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బీహెచ్‌వీఎస్ నారాయణమూర్తి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల ఆవశ్యకతను వివరించారు. ఇంజినీర్లు నూతన ఉత్పత్తులను రూపొందించాల్సిన అవసరంపై దృష్టి సారించాలని సూచించారు. అప్పుడే దేశం ఉత్పత్తి దేశంగా మారుతుందని చెప్పారు. గౌరవ అతిథిగా హాజరైన ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం మాట్లాడుతూ ఓయూలోని ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా నూతన ఆవిష్కరణలు చేసేందుకు అన్ని వసతులు కల్పించామన్నారు. ఓయూ బయోమెడికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సికెల్‌సెల్ అనే వ్యాధి నిర్ధారణ కోసం ఇప్పటి వరకు ఎలాంటి పరికరాలు లేవని చెప్పారు. ఈ లోటును తీర్చేందుకు తాము నూతన పరికరాన్ని రూపొందించామని, త్వరలో దానిని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ పరికరం పేటెంట్ కోసం తాము ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని వివరించారు. శ్రీనివాస్ చామర్తి, ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం డిప్యూటీ కమిషనర్ ఎం. మోహన్‌బాబు, జీఈ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్ ఇంజినీర్ ప్రవీణ్‌కుమార్, బార్క్ శాస్త్రవేత్త ఎంఎల్‌ఎన్ నేంద్ర, ఆస్కార్ గ్లోబల్ రీసర్చ్ సర్వీసెస్ పేటెంట్ అటార్నీ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.

195
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles