ఆర్ట్, మ్యూజిక్‌లో పట్టుంటే జీవితం పరిపూర్ణమే: సీఎస్ ఎస్‌కే జోషి


Sun,September 9, 2018 12:41 AM

చందానగర్, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): ఆర్ట్, మ్యూజిక్‌లో పట్టుసాధిస్తే జీవితం పరిపూర్ణం అయినట్టేనని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరి శైలేంద్రకుమార్ జోషి పేర్కొన్నారు. చందానగర్‌లోని మహిళా దక్షత సమితి ఆడిటోరియంలో హైదరాబాద్ ఆర్ట్స్, కల్చరల్ ఫౌండేషన్, పెగాసెస్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో పునర్‌కృతి పేరిట పెయింటింగ్ వర్క్‌షాప్‌ను ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాశ్, పెగాసెస్ ఆర్ట్ గ్యాలరీ అధ్యక్షురాలు చందనా ఖాన్, హైదరాబాద్ ఆర్ట్, కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షురాలు వినోద్ కే అగర్వాల్ ఐఏఎస్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మి ఐఏఎస్, మహిళా దక్షత సమితి అధ్యక్షురాలు సరోజ్‌బజాజ్‌లతో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళా దక్షత సమితి ద్వారా నిరుపేద బాలికల విద్యకు కృషిచేస్తున్న సమితి అధ్యక్షురాలు సరోజ్ బజాజ్‌ను ఆయన కొనియాడారు. సమితి ద్వారా కొనసాగతున్న కళాశాలల విద్యార్థినులకు చిత్రలేకనంలో అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ వారు చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శనీయమని అన్నారు. సూర్యప్రకాశ్ లాంటి ప్రముఖ చిత్రకారుల సమక్షంలో వర్క్‌షాప్‌లో పాల్గొనే అవకాశం లభించడం ఆ విద్యార్థినుల అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారులు యాగ్నెస్ డీ క్రూజ్, ఆకాశ్ ఆనంద్ సింగ్, అహోబిల ప్రభాకర్, బలబక్త రాజు, చందనాఖాన్, చిన్ని శ్రీపతి, దెబాబ్రత బిస్వాస్, జీవన్ గోషిక, జయా బెహతి, మదుకురువా, రాజీవ్‌సుర్ రాయ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్, శ్రీకాంత్ బాబు ఆడెపు, టైలర్ శ్రీనివాస్, విజయ్‌బెల్దె, విజయ్‌కుమార్‌లు పాల్గొని తమ కళానైపుణ్యంతో ఆకట్టుకున్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్ రమాకుమారి, బన్సిలాల్ మలాని, సుశీల పాటిల్ పాల్గొన్నారు.

230

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles