విద్యాదానం చాలా గొప్పది

Sun,September 9, 2018 12:39 AM

- హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
అబిడ్స్: అన్ని దానాలకన్నా విద్యాదానం గొప్పదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బద్రివిశాల్ పన్నాలాల్ పిత్తి ట్రస్ట్ ద్వారా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. కేజీ టు పీజీ వరకు విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. బద్రి విషాల్ పిత్తి ట్రస్ట్ ద్వారా విద్య కోసం ప్రతి ఏటా వందలాది మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం సంతోషకరమన్నారు. అనంతరం నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలో విద్యనభ్యసించి 65 శాతం నుంచి వంద శాతం మార్కులు సాధించిన ఐదవ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 1400 మంది విద్యార్థిని, విద్యార్థులకు సుమారు 85 లక్షల ఉపకార వేతనాలను అంద చేశారు. అంతే కాకుండా సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెలా 87 మంది వితంతువులకు ట్రస్ట్ ద్వారా పెన్షన్‌లు ఇస్తున్నట్లు తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ శరత్ బి పిత్తి, ఆశీశ్‌పిత్తి, ట్రస్టీ సభ్యులు విజయ్‌కుమార్, విద్యార్థుల తల్లి, దండ్రులు పాల్గొన్నారు.

272

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles