అత్యవసర విభాగంలో వీల్‌చైర్లు అందించేందుకు ట్రాలీబాయ్స్


Wed,November 22, 2017 12:46 AM

-గాంధీదవాఖాన పార్కింగ్ విధానంలో నూతన పద్ధ్దతులు
-ఎలక్ట్రానిక్ గేట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు
గాంధీ దవాఖాన: అత్యవసర విభాగంలో రోగులకు అవ స రమైన వీలు చైర్లు, స్ట్రెచర్లు ఎన్ని అందుబాటులో ఉంచిన అ వి కొద్దిరోజులకే మాయమవుతున్నాయి. దీంతో రోగులను తరలించేందుకు వీలుచైర్లు దొరకక స్వయంగా రోగి బంధు వులే వారిని భుజాలపై మోసుకెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడు తున్న విషయాన్ని పాలనా యంత్రాంగం గుర్తించింది. ఇక ఇలాంటి చర్యలకు చరమగీతం పాడాల్సిందేనంటూ పాల నాయంత్రాంగం కొత్త రకం పాలసీని ముందుకు తీసుకు వ చ్చింది. వీలు చైర్, ట్రాలీస్ ట్రాకింగ్ విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. 24గంటల పాటు 6గురు ట్రాలీ బాయ్స్‌ను అం దుబాటులో ఉంచి వీలు చైర్లు, ట్రాలీలు ఎవరు తీసుకెళ్లారో వారిని గుర్తించి ఆవీలు చైర్లను తిరిగి యథాస్థానానికి తీ సుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. ఆ విధానం త్వ రలోనే అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో అటు రోగులకు ఇబ్బందులు, వీలు చైర్లు, ట్రాలీలు లేవన్న అప వాదులు తప్పుతాయని భావింస్తున్నది.

పార్కింగ్ విధానంలో నూతన పద్దతులు...
దవాఖానలో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది, విద్యను అభ్యసించే వైద్య విద్యార్థుల వాహనాలను పార్కింగ్ చే సుకునేందుకు ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేస్తుంది. ఆయా స్థలాలకు వాహనాలు వెళ్లాలంటే వారికి ప్రత్యేకమైన గుర్తిం పు కార్డులను అందజేస్తారు. ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఫర్‌ది పార్కింగ్) సిస్టం ద్వారా ఎలక్ట్రానిక్ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వాహనానికి ఇచ్చిన ఐడెంటీటీ ఉంటేనే గేట్లు తెరిచేవిధంగా నూతన పద్దతులను అవలంభించాలని పాలనా యంత్రాంగం నిర్ణ యించింది. అందుకు కావాల్సిన పరికరాలను, పార్కింగ్ ప్రాంతాలను గుర్తించే పనిలో మేనేజర్లను సిద్ధం చేసింది. దీంతో మంగ ళవారం నుండే ఆ దిశగా మేనేజర్లు కృషి చేస్తున్నారు. ఇక పోతే ప్రయివేట్ పార్కింగ్‌ను అంతా ఒక వైపు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది.

గతంలో నిర్వహించిన పార్కింగ్ కాంట్రాక్టర్ విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తుండటంతో దవాఖానకి వచ్చి పోయే రోగులకు, వారి సహాయకులకు ఇబ్బందిగా మారేది. దీన్ని గుర్తించిన పాల నా యంత్రాంగం గట్టి చర్యలనే చేపట్టింది. నూతన పార్కిం గ్‌లో టెండరు దక్కించుకున్న వ్యక్తికి ఖచ్చితమైన నిబంధన లను విధించింది. టూ వీలర్ వాహనానికి 5రూ.ల చొప్పు న, ఫోర్‌వీలర్ వాహనాలకు 10రూ.ల చొప్పున మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించి బోర్డులను కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా అక్కడ వాహన దారునికి ఎలాంటి ఇబ్బందులు కలిగిన వెంటనే సంబంధిత ఆర్‌యంఓకు ఫిర్యాదు చేసేలా ఫోన్ నంబర్లను అందుబా టులో ఉంచేలా చర్యలు తీసుకుంది. పైవిధానం అంతా అ మలులోకి వస్తే ప్రయివేట్ దవాఖాన లకు దీటుగా ఉంటుందని యంత్రాంగం భావిస్తుంది.

257
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...