నీటి బిల్లుల ఎగవేతదారులే టార్గెట్ ..!


Tue,November 21, 2017 02:47 AM

-ఆరు నెలల పైబడి ఉన్న బకాయిదారులను గుర్తించి చర్యలు
-రంగంలోకి ప్రత్యేక బృందాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఖజానాకు గండికొడుతున్న మొండి బకాయిదారులపై కఠిన చర్యలకు జలమండలి సిద్ధమవుతున్నది .ఆరు నెలలుగా వరుస గా నీటి బిల్లులు చెల్లించని వాణిజ్య కనెక్షన్లు, సంవత్సరాల తరబడి నీటి బిల్లులు చెల్లించని బకాయిదారులే లక్ష్యంగా ప్రత్యే క సిబ్బందిని రంగంలోకి దింపుతున్నా రు. ప్రస్తుతం నీటి బిల్లుల జారీ, వసూళ్లలో డాకెట్ల విధానాన్ని పటిష్ట పరిచి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను కీలకం చేసిన సంగతి తెలిసిందే. నీటి బిల్లుల జారీ, రెగ్యూలర్ వసూళ్లపై టెండర్ దక్కించుకున్న ఏజెన్సీలు బాధ్యత వహిస్తున్నాయి. ఇక.. ఈ నూతన డాకెట్ విధానం అమలుతో సంస్థకు సంబంధించిన 135 రెగ్యూలర్ ఉద్యోగులు మొండి బకాయిదారుల వసూళ్లకు వినియోగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే నీటి బిల్లుల ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టి సారించారు.

గ్రేటర్‌లో 9.12 లక్షల నల్లా కనెక్షన్‌లు ఉండగా, ఇందులో వాణిజ్య కేటగిరీ కనెక్షన్‌లు దాదాపు 45 వేల వరకు ఉన్నాయి. వాటిలో 6 నెలలకు పైగా బిల్లులు బకాయి ఉన్న వినియోగదారుల సంఖ్య 8 వేల వరకు ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఈ మొండి బకాయిదారుల విషయంలో కఠినంగా ఉండాలని ఎండీ దానకిశోర్ నిర్ణయించారు. ఎండీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు రెడ్ నోటీసులతో మొండి బకాయిదారుల వెన్నుల్లో వణుకుపుట్టిస్తున్నారు. ఐతే .. పెరుగుతున్న నిర్వహణ వ్యయం, ఆదాయం రాకపోవడంతో ఆదాయాన్ని పరిపుష్టి చేసే మార్గాలపై దృష్టి సారించింది. వాస్తవంగా గ్రేటర్‌లో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, రుణాల చెల్లింపు ఇతరత్రా ఖర్చులకు ప్రతి నెలా రూ.110కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. వసూలవుతున్న నీటి బిల్లులు మాత్రం నూ.90 నుంచి 95కోట్ల మాత్రమే. దీంతో ప్రతి నెలా రూ. 15 నుంచి రూ.20కోట్లు సంస్థకు ఆర్థిక భారంగా మారుతున్నది. దీనిని అధిగమించేందుకు బకాయిల వసూలుపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. బకాయిలను రాబట్టడమే లక్ష్యంగా చర్యలకు ఉపక్రమించారు.

బకాయిల చిట్టా ఇదే...
క్యాటగిరీ మొండి బకాయిదారులు బకాయి (రూ.కోట్లలో)
స్లమ్స్ 68261 78.16
రాజీవ్ గృహకల్ప 8563 19.95
డొమిస్టిక్ 235644 359.64
మొత్తం 312468 457.75

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...