డాటా ఎంట్రీ ముసుగులో మోసాలు !


Tue,November 21, 2017 02:46 AM

-రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో అమాయకులకు బురిడీ
-బోగస్ సంస్ధలు, వ్యక్తులపై దృష్టిపెట్టిన సైబర్‌క్రైమ్ పోలీస్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: డాటా ఎంట్రీ పేరుతో నగరంలో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దృష్టి పెట్టారు. తాజాగా అమీర్‌పేట్‌లో ఓ డాటా ఎంట్రీ నిర్వాహకుడి మోసాలు బయటపడడంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమయ్యింది. అమీర్‌పేట్, సికింద్రాబాద్, బేగంపేట్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ, పంజాగుట్ట, మెహిదీపట్నం తదితర ప్రాంతాలలో డాటా ఎంట్రీ పేరుతో మోసాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో డాటీ ఎంట్రీ మోసాలను పూర్తిస్ధాయిలో అడ్డుకట్ట వేసేందుకు మార్కెటింగ్ ఇంటలిజెన్స్ వింగ్ సిద్దమవుతుంది. డాటా ఎంట్రీ అనేది కంప్యూటర్‌లో టైప్ చేయడానికి వస్తే చాలు.. ఈజీ వర్క్.. ఇంట్లో కూ ర్చొని నెలకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదించుకోవచ్చంటూ కొందరు అమాయకులను ఆకర్షిస్తున్నారు. ప్రకటనలను చూసి నిజమేనని ఆయా సంస్ధలను, వ్యక్తులను ఆశ్రయించి మోసపోతున్న వారు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్నారు.

ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజ్ అంటూ రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు వసూలు చేస్తారు. తాము నెల కు కొన్ని పేజీలు ఇస్తామని, వాటిని తప్పులు లేకుండా టైప్ చేసి పంపిస్తే, మీకు నెలకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు వస్తుందంటూ నమ్మిస్తారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని, మరోసారి మీరు డబ్బు చెల్లించాల్సిన పనిలేదంటూ బుట్టలో వేసుకుంటారు. వచ్చిన వారికి ఒక గంట పాటు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. కౌన్సిలింగ్‌లో ఒక ఇమేజీలో ఉన్న టెక్ట్స్‌ను టైప్ చేయడం ఎలా అని చూపిస్తారు. ఇమేజీలో ఉన్న టెక్ట్స్‌ను చూసి టైప్ చేయడం ఈజీగానే ఉంటుందని నమ్మిస్తారు. నిర్వాహకులు చెప్పే మాట లు విని ఎంత ఈజీ వర్కోనంటూ ఉబ్బితబ్బిపోతారు. వెంటనే తక్కువ మొత్తంలో నగదు కావడంతో రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లిస్తారు. ఇలా చెల్లించిన వారికి ఒక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చి సంస్ధకు సంబంధించిన లింకును ఇవ్వడం, లేదంటే ఈమెయిల్‌లో ఈమేజ్‌లు పంపించడం చేస్తుంటారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా కట్టిన డబ్బు... ఒక్క నెలలోనే వచ్చేస్తుందని, మిగతా 11 నెలలకు వచ్చే డబ్బు తమ జేబులో వేసుకోవచ్చని చాలమంది ఇలాంటి డాటా ఎంట్రీ వర్క్‌లకు ఆకర్షితులవుతున్నారు.

మోసం ఇలా జరుగుతుంది
డాటా ఎంట్రీ వర్కంటూ ఇప్పుడు మార్కెట్లో ఒకటి రెండు బడా సంస్ధలు తప్ప మిగతా వారి వద్ద లేదని ఐటీ నిపుణు లు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచమంతా డిజిటలైజేషన్ అయ్యింది. డిజిటలైజేషన్ కాని వారు, ఆయా సంస్ధలను డిజి టైలేజేస్ చేసుకునే వారు వారి వద్ద ఉన్న పాత రికార్డులను డిజిటైలేజేషన్ కోసం టెండర్లలో తక్కువ ధరకు కోట్ చేసే సంస్ధలకు అప్పగిస్తారు. ఇలాంటి సంస్ధలు సబ్‌కాంట్రాక్టులు ఇచ్చినా అడ్వాన్స్‌గా డబ్బులు మాత్రం ఎవరి వద్ద తీసుకోరు. అయితే ప్రస్తుతం నగరంలో ప్రకటనలలో తాము డాటా ఎంట్రీ వర్క్ ఇస్తామంటూ చెప్పుకునే సంస్ధలు, వ్యక్తు లు మోసాలు చేయడానికి ఆ ప్రకటనలు ఇస్తున్నట్లు గుర్తించాలని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంట్లో కూర్చొన్ని, కంప్యూటర్‌లో పెద్దగా పరిజానం లేకున్నా నెలకు రూ. 10 వేల నుంచి రూ 20 వేల వరకు సంపాదించవచ్చని చెప్పడంతో చాలమంది అది నిజమేనని నమ్ముతారు.

ఇలాం టి వారిని బుట్టలో వేసుకోవడానికి ఆయా సంస్ధలు, వ్య క్తులు తమంతటా తాముగా డాటా ఎంట్రీ వర్క్‌ను సృష్టిస్తున్నారు. ఇంటర్‌నెట్‌లో లభ్యమయ్యే డాటాతో ప్రత్యేకంగా డాక్యుమెంట్లు తయారు చేస్తారు, అందులోని ఫాంట్‌ను ఎవరికి అర్ధం కాని విధంగా ఇతర దేశాలదిగా నమ్మిస్తూ మార్చేస్తారు, వాటిని ఇమేజ్‌గా మార్చేస్తారు. ఇలా మార్చిన ఇమేజ్‌ను తమ వద్ద డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పంపిస్తారు. ఇలా ఒకో ఇమేజ్‌ను టైప్ చేసినందుకు రూ. 50 నుంచి రూ. 90 వరకు ఇస్తామంటూ నమ్మిస్తారు. రోజు కనీ సం పది ఇమేజ్‌లు టైప్ చేసినా రూ. 500 నుంచి రూ. 900 వరకు సంపాదించవచ్చనే ధీమాను రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులలో ఉంటుంది. ఇమేజ్‌లలోని అర్ధమయ్యి, అర్దం కాని ఆంగ్ల పదాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నెలంత కష్టపడి బాధితుడు వాటిని టైప్ చేసి సంస్ధకు పంపిస్తాడు. అందులో చాల వరకు తప్పులుంటాయి, దీంతో మీరు చేసిన పని బాగోలేదు.. తప్పులు ఎక్కువగా ఉన్నాయంటూ చేసిన పని కి డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తారు.

దీంతో బాధితుడు సైతం నేనే కరెక్ట్‌గా చేయలేదనే భావనతో ఇక విషయాన్ని మరిచిపోతాడు. రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించిన డబ్బులు తిరిగి రావు.. మోసపోయాననే విషయాన్ని బాధితుడు గుర్తించడు, ఇతరుల నుంచి తెలుసుకొని తాను మోసపోయానని గుర్తించినా కట్టింది తక్కువే కదా.. అక్కడకు వెళ్లి గొడవ ఏమి పెట్టుకోవాలనే దోరణితో ఉంటాడు. దీంతో డాటా ఎంట్రీ వర్క్‌లు ఇచ్చే వారిని ప్రశ్నించే వారు తక్కువగా ఉంటారు, ఎవరైనా మోసాన్ని గుర్తించి నిలదీస్తే మాత్రం వారి రిజిస్ట్రేషన్ డబ్బు లు తిరిగి ఇచ్చేస్తారు. దీంతో ఇలాంటి విషయాలు పోలీసుల వద్దకు రాకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. దీంతో ఇప్పుడు డాటా ఎంట్రీ పేరుతో జరుగుతున్న మోసాలను పోలీసులు గుర్తిస్తున్నా... బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయకపోవడంతో వారి ఆటలు సాగుతున్నా యి. అయితే ఇలాంటి ప్రకటనలు చూసి ప్రతి నెల పదులు, వందల సంఖ్యలో బాధితులు వస్తుండడంతో ఆయా సంస్ధల నిర్వాహకులు లక్షల్లో సంపాదిస్తున్నారు.

పరువుపోతుందని ఫిర్యాదు ఇవ్వడంలేదు
డాటా ఎంట్రీ పేరుతో జరుగుతున్న మోసాలపై తమకు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే బాధితులు చాలమం ది మోసపోయిన విషయం బయటకు తెలిస్తే పరువు పో తుందని, ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మోసపోయిన బాధితుడు దైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు పిర్యాదు చేయడంతో, మరింత మం ది అమాయకులు మోసపోకుండా ఉంటారు. డబ్బుతో నిమిత్తం లేకుండా జరుగుతున్న మోసాన్ని బయటపెట్టడంతో సమాజంలో ఇలాంటి మోసాల బారిన పడకుం డా చాలమంది జాగ్రత్త పడుతారు. ఏ పని విషయంలోనైనా ముందుగా డబ్బు అడిగారంటే అక్కడ మోసం జరుగుతుందని అనుమానించాల్సిన అవసరముంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి.
-రఘువీర్, అదనపు డీసీపీ, సైబర్‌క్రైమ్స్

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...