ప్రేమపేరుతో జూనియర్ ఆర్టిస్టును మోసం చేసిన వ్యక్తి అరెస్ట్


Tue,November 21, 2017 02:45 AM

బంజారాహిల్స్(నమస్తే తెలంగాణ): ప్రేమించానన్నాడు..సర్వం నీవే అని సహజీవనం చేశాడు. మోజు తీరిన తర్వాత ముఖం చాటేశాడు. మరో పెళ్లికి సిద్దపడడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయిం చడంతో కటకటాల పాలయ్యాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన సుధాకర్(25) బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇం దిరానగర్ సమీపంలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో హెచ్‌ఆర్‌గా పని చేస్తున్న సుధాకర్ కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ (21)ని ప్రేమలో దింపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి

ఏడాదిరన్నర కాలంగా కృష్ణానగర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని సహజీవనం చేశాడు. తనను పెళ్లిచేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి తీసుకురావడంతో ముఖం చాటేశాడు. ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో గుంటూరులోని సుధాకర్ ఇంటికి వెళ్లి విషయాన్ని నిలదీసింది. అయితే తనకు పెళ్లి ఇష్టం లేదని,కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే నీతో ఉన్నానంటూ ముఖం మీదే చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న మరో యువతితో పెళ్లికి సిద్దపడ్డాడు. ఈ విషయాన్ని తెలుసు కున్న బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుధాకర్‌పై ఐపీసీ 420,493 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సుధాకర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...