చదువుల పేరుతో మోసం.. మతమార్పిడి


Mon,November 20, 2017 03:07 AM

-10 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు\
ఉప్పల్(నమస్తే తెలంగాణ) : గుర్తింపులేని సొసైటీ పేరుతో పాఠశాల నిర్వహిస్తూ పేదపిల్లలకు చదువు చెప్పిస్తామని చెప్పి మతమార్పిడులు పాల్పడుతున్న ముఠా సభ్యులను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాహకుడు, వారికి సహకరిస్తున్న వ్యక్తులపై జువైనల్ యాక్టు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, తదితర కేసు లు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 10 మందిలో 9మందిని అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్‌రావు, మల్కాజిగిరి సీఐ జానకిరెడ్డిలు ఆదివారం ఉప్పల్‌లోని ఏసీపీ కార్యా ల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పీస్ ఆర్పన్ హోం సోసైటీ పేరుతో వరంగల్‌లో సంస్థను ఏర్పాటు చేశారు. అనంతరం గత ఏడాది నగరానికి మా ర్చా రు.

అనంతరం 16 రోజుల క్రితం అబ్దుల్లాకు చెందిన మౌలాలిలోని మారుతినగర్ ప్రాంతానికి మకాం మార్చారు. ఈ హోంలో 17 మంది పిల్లలు ఉంటున్నారు. వీరిలో 10 మంది బాలురు, 7 మంది బాలికలు ఉన్నారు. చదువు చెప్పిస్తామని చెప్పి ఇతర కార్య క్రమాలు చేపడుతున్నారని ఫిర్యాదు వచ్చింది. దీనితో దర్యాప్తు చేయగా పూర్తి వివరాలు వెలుగుచూశాయన్నారు. నిర్వాహకులు గతంలో మతమార్పిడి చేసుకున్నారు. నిర్వాహకు డు సిద్దిఖీ అలియాస్ సత్యనారాయణ 2004లో మతమార్పిడి చేసుకున్నారు. కొంత మం దితో కలిసి వరంగల్‌లో సొసైటీ ఏర్పాటు, హైదరాబాద్‌కు మార్చి ఎర్రకుంట ప్రాం తంలో నడిపారు.

లోకేషన్ మార్చారు. మౌలాలికి మార్చి కార్యకలాపాలు చేస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు చదువు చెప్పిస్తామని చెప్పి ఉర్ధూ, అరబిక్, ఖూరాన్‌ను నేర్పిస్తున్నారు. హిందూ పిల్లలను తీసుకువచ్చి, పేర్లు మార్చకుండా ముస్లిం మతంలోకి మార్చు తున్నారు. మతం మార్చి, వారి రిజర్వేషన్లు మార్చకుండా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం, వీటిని చూపిస్తూ ఇతర పిల్లలను తీసుకురావడం చేయడం జరుగుతుంది. హోంపై తనిఖీలు చేసి, నిర్వాహకులను, వారికి సహకరిస్తున్న మహ్మద్ సిద్ధిఖి(సత్యనారాయణ), అబ్దుల్లా(ప్రవీణ్), సయ్యద్ అబ్దులా, షకీల్ అహ్మద్, ఇస్మా యిల్, అబ్దుల్లా (సోమేశ్వర్‌రావు), సాగర్, రబ్బానీ, ఫీయాజుద్దీన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అమీర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు.

419
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...