శివార్లపై చైన్‌స్నాచర్ల కన్ను


Mon,November 20, 2017 03:02 AM

-సిటీలో సీసీ కెమెరాలతో రూట్ మార్చిన క్రిమినల్స్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో క్రిమినల్స్ తమ నజర్‌ను శివారు ప్రాంతాలకు మళ్ళించారు. పట్టణ ఏరి యాలకు ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాలపై స్నాచర్లు దృష్టి పెట్టారు. దీని కోసం ఆ ఏరియాల్లో రెక్కీలను చేసు కుంటున్నారు. అందులో సీసీ కెమెరాలు లేని స్పాట్‌లను ఫిక్స్ చేసుకుని అక్కడి నుంచి ఈజీగా పారిపోయే మార్గాల ను ముందుగానే ఎంచుకుంటున్నారు. ఇటీవల మీర్‌పేట్, కీసర ప్రాంతాల్లో జరిగిన స్నాచింగ్ కేసులతో శివారు ప్రాం తాల మహిళలను టార్గెట్ చేశారని స్పష్టమవుతున్నది. దీని కోసం స్నాచర్లు ఇప్పుడు ఎక్కువగా రాచకొండ, సైబరాబా ద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచరిస్తున్నట్లు సమాచా రం. ఈ శివారు ప్రాంతాల్లో ఇప్పుడు సింగిల్ ఆఫెండర్‌లో ఎక్కువగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది.

ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయాల్లో పొలం పనుల నుంచి భోజనానికి ఇంటికి వచ్చే వారిని, సా యంత్రం కూరగాయాలు అమ్ముకుని గ్రామానికి తిరిగి వచ్చే టైంను, రాత్రి సమయాల్లో దుకాణాలకు వెళ్ళే మహిళ ల్ని, వృద్ధ దంపతులు ఎవరైనా నిర్మానుష్య ప్రాంతాల మీదుగా వెళ్ళినప్పుడు గొలుసులను తెంపుకుని పారిపోతున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో వారిని గుర్తించడం ఆలస్యమవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు శివారు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును అత్యవసరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోకి శివారు గ్రామాలు ఉన్న పోలీసు స్టేషన్‌లు రావడంతో ఇప్పుడు ఆ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయితీల సహకారంతో ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలిసింది.

176
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...