గురువారం 28 మే 2020
Devotional - May 04, 2020 , 08:03:17

నేటి నుంచి యాదాద్రి నృసింహుని జయంతి ఉత్సవాలు

నేటి నుంచి యాదాద్రి నృసింహుని జయంతి ఉత్సవాలు

హైదరాబాద్‌: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నేటి నుంచి మూడు రోజులపాటు స్వామివారి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం స్వస్తివాచనం, లక్షపుష్పార్చన సేవ, తిరువేంకటపతి అలంకార సేవ, రాత్రి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవలు జరుగుతాయి. మంగళవారంం ఉదయం కాళీయమర్దన సేవ, లక్ష కుంకుమార్చన, రాత్రి రామవతార సేవలు నిర్వహిస్తారు. ఎల్లుండి (బుధవారం) పూర్ణాహుతి, సహస్ర ఘటాభిషేకంతో జయంత్రి ఉత్సవాలు ముగుస్తాయి. యాదాద్రీశుని ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు.


logo