సోమవారం 26 అక్టోబర్ 2020
Devotional - Sep 30, 2020 , 20:24:39

తెరచుకోనున్న బాంకీ బిహారీ ఆలయం

తెరచుకోనున్న బాంకీ బిహారీ ఆలయం

న్యూఢిల్లీ : బృందావనంలోని ప్రఖ్యాత బాంకీ బిహారీ ఆలయంలోకి అక్టోబర్‌ 17 నుంచి భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ యంత్రాంగం బుధవారం తెలిపింది. భక్తులందరు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తప్పనిసరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుందని ఆలయ పూజారి తెలిపారు. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ నుంచి దాదాపు ఐదు నెలల నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించడం లేదు. దేవాలయంలో కొన్ని పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని.. ఆలయం మూసివేత సమయాన్ని ఇందుకు వినియోగించుకున్నట్లు చెప్పారు. గత నెలలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన అన్‌లాక్‌ మార్గదర్శకాల మేరకు భక్తుల కోసం ఆలయాన్ని తెరుస్తున్నారు. ఫ్లోర్‌ పునర్ధురణ పనులు వచ్చే నెల 15 నాటికి పూర్తి కానుండగా.. 17వ తేదీ నుంచి భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు తప్పనిసరిగా ప్రోటోకాల్స్‌ అమలు చేస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ నుంచి ఆలయం మూసివేసినప్పటికీ.. ఆవరణలో నిత్యపూజలు, ఇతర క్రతువులు యథావిధిగా నిర్వహించినట్లు పూజారి వివరించారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo