ఆదివారం 09 ఆగస్టు 2020
Devotional - Jul 12, 2020 , 16:51:23

టీటీడీ ఆస్తులపై అధ్యాయనం తర్వాత శ్వేతపత్రం

టీటీడీ ఆస్తులపై అధ్యాయనం తర్వాత  శ్వేతపత్రం

తిరుమల: తిరుమల, తిరుపతి దేవస్థానానికి ఉన్న ఆస్తుల అధ్యాయనం పూర్తయ్యాకే శ్వేతపత్రం విడుదల చేస్తామని టీటీడీ ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రకటించారు. ఆదివారం నిర్వహించిన డయల్‌ యువర్‌ కార్యక్రమంలో ఆయన భక్తులతో మాట్లాడారు.

 బ్రహ్మోత్సవాల నిర్వహణపై మాట్లాడుతూ..బ్రహ్మోత్సవాల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని అయితే, ఉత్సవాలకు టెండర్లు పిలిచామని వెల్లడించారు. ప్రతి రోజూ 10వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కరెంటు బుకింగ్‌ ద్వారా 85,434 మంది భక్తులు  దర్శించుకున్నారని అన్నారు. కరోనా సడలింపుల అనంతరం ఆలయం  ప్రారంభమైన నెలరోజుల్లోనే ఆలయానికి  రూ. 16.73 కోట్లు ఆదాయం వచ్చింది.  ఇప్పటివరకు  13.36లక్షల లడ్డులు భక్తులకు అందజేశామని ఈవో వెల్లడించారు.

కరోనాను నియంత్రించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. టీటీడీ ఉద్యోగులకు, సిబ్బందికి నిర్వహించిన పరీక్షల్లో 91 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని ఆయన వివరించారు. logo