గురువారం 03 డిసెంబర్ 2020
Devotional - Oct 22, 2020 , 12:41:28

కాత్యాయని అలంకారంలో వరంగల్‌ భద్రకాళి

కాత్యాయని అలంకారంలో వరంగల్‌ భద్రకాళి

వరంగల్‌ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వరంగల్‌ భద్రకాళి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజు అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. కాత్యాయని త్రిమూర్తుల తేజంతో అలరారుతుందీ దేవి రూపం. మహిషాసురుణ్ణి సంహరించడానికి ఎత్తిన ఈ అవతారాన్ని ముందుగా కాత్యాయనుడు అనే ముని పూజించడం వల్ల ఈమెకీ పేరు వచ్చింది. నాలుగు చేతులున్న తల్లి వాహనం సింహం. ఒక చేతిలో ఖడ్గం, రెండో చేతిలో కమలం ధరించి దర్శనమిస్తారు. మిగిలిన రెండు చేతులూ వరద ముద్ర, అభయ హస్తంగా ఉంటాయి. కష్టాలు బాధలు తీరాలనే కోరికతో ఈ రూపంలో పూజిస్తారు. ప్రకృతికి ప్రతీక అయిన ఆకుపచ్చ రంగులో దర్శనమిచ్చే తల్లిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. కాత్యాయనిగా దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారిని భక్తులు దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులను అనుగ్రహించనున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.