శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jul 14, 2020 , 17:17:32

మాన‌వాళి ఆరోగ్యం కోసం తిరుమలలో విశ్వశాంతిహోమం

మాన‌వాళి ఆరోగ్యం కోసం తిరుమలలో విశ్వశాంతిహోమం

తిరుమల: కరోనా విపత్కర పరిస్థితుల్లో మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ మంగళవారం తిరుమలలో  సాంగోపాంగ   అష్టాక్షరీ, ద్వాదశాక్షరీ మహాసుదర్శన సహిత విశ్వశాంతి హోమాన్ని నిర్వహించారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆలయ అర్చకుల ఆధ్వరంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ‘‘ ఓమ నమో నారాయణాయ’’ అష్టాక్షరి మంత్రాన్ని, ‘‘ ఓమ నమో భగవాతే  వాసుదేవాయ’’ ద్వాదశాక్షరీ మంత్రాని జపిస్తూ హోమం నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ.. కరోనా వ్యాధి నుంచి మానవాళిని రక్షించాలని స్వామివారిని కోరుతూ వేదపాఠశాలలో  ప్రతిరోజూ వేదపారాయణం నిర్వహిస్తున్నా మన్నారు. మంగళవారం అశ్విని నక్షత్రం కలిసిన భౌమాశ్విని యోగం పర్వదినం కావడంతో  విశ్వశాంతి హోమాన్ని పూర్ణాహుతితో పూర్తి చేశామన్నారు. వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు మోహనరంగాచార్యులు   మాట్లాడుతూ.. భౌమాశ్విని యోగం రోజున మంచి పనులు చేస్తే కోటి రెట్ల ఫలితం కలుగుతుందని శాస్త్రం చెబుతుందన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo