గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Jul 20, 2020 , 23:19:57

జూలై 31న తిరుచానూరులో వ‌ర్చువ‌ల్ వరలక్ష్మీ వ్రతం

 జూలై 31న తిరుచానూరులో వ‌ర్చువ‌ల్ వరలక్ష్మీ వ్రతం

తిరుపతి :  సిరుల త‌ల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై  31న శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి జెఈవో  పి.బ‌సంత్‌కుమార్ తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని ఆయ‌న కార్యాల‌యంలో సోమ‌వారం ఉద‌యం అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ప్ర‌తి ఏడాది ప‌విత్ర‌మైన శ్రావ‌ణ మాసంలో నిర్వ‌హించే వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని భ‌క్తుల కోరిక మేర‌కు ఆన్‌లైన్‌(వ‌ర్చువ‌ల్‌)‌లో ‌చేయాల‌ని టిటిడి నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.

గ‌త ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో వీలైన‌న్ని ఆర్జిత సేవ‌ల‌ను ఆన్‌లైన్‌(వ‌ర్చువ‌ల్‌) ప్ర‌క్రియ ద్వారా నిర్వ‌హించాల‌ని తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని ఆన్‌లైన్‌(వ‌ర్చువ‌ల్‌)‌లో నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా దేశ విదేశాల‌లోని భ‌క్తులు అమ్మ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించే వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని త‌మ త‌మ నివాస ప్రాంతాల నుండి ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వీక్షించి, పాల్గొనే అవ‌కాశం టిటిడి క‌ల్పిస్తుంద‌న్నారు. వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్లు జూలై 22వ తేదీ సాయంత్రం 5 గంట‌ల నుం చి జూలై 30వ తేదీ సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు గృహ‌స్తులు టిటిడి వెబ్‌సైట్ ద్వారా పొంద‌వ‌చ్చ‌న్నారు.

టికెట్లు కావ‌ల‌సిన గృహ‌స్తులు టిటిడి వెబ్‌సైట్‌లో త‌మ వివ‌రాలు పొందుప‌ర్చి, టిటిడి నియ‌మ నిబంధ‌న‌లకు లోబ‌డి గేట్‌వే ద్వా‌రా రూ.1001/- చెల్లించి ఆన్‌లైన్ ర‌శీదు పొంద‌వ‌చ్చ‌ని, ఇందులో గృహ‌స్తుల‌కు ప్ర‌సాదాలు అందించేందుకు పోస్ట‌ల్ సేవ‌లు క‌లిపి రుసుం నిర్ణ‌యించ‌డం జ‌రిగింద‌న్నారు.  ఈ సేవ‌లో పాల్గొనే భ‌క్తుల‌కు తొలి శ్రావ‌ణ శుక్ర‌వారం పూజ‌లో అర్పించిన ఉత్త‌రియం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, కంక‌ణాలు, గాజులు ప్ర‌సాదంగా ఇండియా పోస్ట‌ల్ ద్వారా గృహ‌స్తుల చిరునామాకు పంప‌డం జ‌రుగుతుంద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని జూలై 31వ తేదీ ఆన్‌లైన్ (వ‌ర్చువ‌ల్‌) లో ఉద‌యం 10.00 నుం చి మ‌ధ్యాహ్నం12 గంట‌ల వ‌ర‌కు ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చే స్తామ‌ని తెలిపారు. ఈ వ్ర‌తంలో పాల్గొనే గృహ‌స్తులు అర్చ‌క స్వాముల సూచ‌న‌ల మేర‌కు త‌మ గోత్ర నామాలు, సంక‌ల్పం ప‌ఠించాల్సి ఉంటుంద‌న్నారు. కాగా, ఆన్ లైన్ లో టికెట్లు పొందిన గృహ‌స్తుల పేరు, గోత్ర నామాల ప్రతిని అర్చకులు అమ్మవారి మూల విరాట్టు పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహిస్తారన్నారు.వ‌ర‌లక్ష్మీ వ్ర‌తం‌ పూర్తిగా ఆన్‌లైన్‌(వ‌ర్చువ‌ల్‌) సేవ అయినందున, ఈ వ్ర‌తం కొర‌కు పేర్లు న‌మోదు చేసుకుని, టికెట్లు పొందిన భ‌క్తుల‌కు తిరుచానూరు అమ్మ‌వారి ఆల‌యంలో ప్ర‌త్య‌క్షంగా వ్ర‌తంలో పాల్గొనే అవ‌కాశం లేద‌ని తెలిపారు. విదేశాల‌లో ఉన్న భ‌క్తులు ఆన్‌లైన్ టికెట్లు ‌పొంది ఆన్‌లైన్‌(వ‌ర్చువ‌ల్‌) ద్వారా ఈ వ్ర‌తంలో పాల్గొన‌వ‌చ్చు, కానీ వారికి ప్ర‌సాదాలు పంప‌డం సాధ్యం కాదని తెలియ‌జేశారు. 


logo