శుక్రవారం 04 డిసెంబర్ 2020
Devotional - Oct 25, 2020 , 22:10:45

శ్రీవారి ఆలయంలో వేడుక‌గా పార్వేట ఉత్స‌వం

 శ్రీవారి ఆలయంలో వేడుక‌గా పార్వేట ఉత్స‌వం

తిరుమల: శ్రీవారి ఆలయంలో విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం ఆదివారం ఏకాంతంగా జ‌రిగింది. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసిన‌ మ‌రుస‌టి రోజున ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. అంతేకాదు సంక్రాంతి క‌నుమ పండుగ రోజు కూడా తిరుమ‌ల‌లో పార్వేట ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని కల్యాణోత్స‌వ‌ మండపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వేంచేపు చేశారు. శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు పంచాయుధాలైన శంఖం, చ‌క్రం, గ‌ద‌, ఖ‌డ్గం, ధ‌నస్సు ధ‌రించి పార్వేట ఉత్స‌వంలో పాల్గొన్నారు. ఈ ఉత్స‌వంలో భాగంగా టిటిడి ఈవోకు ఆల‌య మ‌ర్యాద ప్ర‌కారం ప‌రివ‌ట్టం కట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.