సోమవారం 19 అక్టోబర్ 2020
Devotional - Sep 27, 2020 , 07:19:35

నేటితో ముగియనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

నేటితో ముగియనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అద్భుతంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, స్నపన తిరుమంజనాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు చక్రస్నానం నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ఈ నెల నుంచి 19 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.  కరోనా నేపథ్యంలో టీటీడీ బోర్డు ఆల‌యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించింది. గతంలో కాకుండా వాహన సేవల సమయాల్లోనూ మార్పులు చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటలు, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య వాహన సేవలు జరిగాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo