శనివారం 06 జూన్ 2020
Devotional - Apr 04, 2020 , 08:50:58

రేప‌టి నుంచి శ్రీవారి వార్షిక వ‌సంతోత్స‌వాలు

రేప‌టి నుంచి శ్రీవారి వార్షిక వ‌సంతోత్స‌వాలు

తిరుప‌తి: తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వార్షిక వ‌సంతోత్స‌వాలను ఆదివారం నుంచి నిర్వ‌హించ‌నున్నారు. ఆది, సోమ‌, మంగ‌ళ వారాల్లో మూడు రోజుల‌పాటు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నుంది. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ నేప‌థ్యంలో ఈ సారి స్వామివారి వ‌సంతోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. అదేవిధంగా ప్ర‌తి ఏడాదిలా వ‌సంత మండ‌ప‌లంలో కాకుండా క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీనివాసుడి వ‌సంతోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది.   

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo