సోమవారం 10 ఆగస్టు 2020
Devotional - Jul 28, 2020 , 21:49:29

శ్రీశైలంలో పరోక్ష ఆర్జితసేవగా వరలక్ష్మీ వ్రతం

శ్రీశైలంలో పరోక్ష ఆర్జితసేవగా వరలక్ష్మీ వ్రతం

శ్రీశైలం - శ్రీశైల మహా క్షేత్రంలో శ్రావణమాస శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాలను భక్తుల సౌకర్యార్ధం పరోక్షసేవగా జరిపించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. ఏటా ఆలయ ప్రాకారంలో సామూహికంగా మహిళలచే శాస్తోక్తంగా జరిపించడం ఆలయ సాంప్రదాయంగా వస్తున్నదని, అయితే కరోనా నివారణ చర్యల్లో భాగంగా దర్శనాలు నిలిపివేయడం వల్ల భక్తుల అభీష్టం మేరకు అందరికీ అందుబాటులో ఉండేలా వరలక్ష్మీ వ్రత పరోక్ష ఆర్జితసేవ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రావణ మాసం రెండో శుక్రవారం ( జూలై 31న ) వ్రతం చేయదలచిన సేవాకర్తలు గోత్రనామాలతో పూర్తి వివరాలను దేవస్థానం వెబ్ సైట్ www.srisailamonline.com  లో నమోదు చేసుకోవాలని కోరారు. అర్చక వేదపండితులు జరిపించే వ్రత కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఇంటర్నెట్ లో యుట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. భక్తులు మరిన్ని వివరాల కోసం దేవస్థానం కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 8333901351, 52, 53 లలో సంప్రదించవలసిందిగా సూచించారు.


logo