బుధవారం 12 ఆగస్టు 2020
Devotional - Jul 28, 2020 , 11:21:57

గోవింద మొబైల్‌ యాప్‌లోనూ వరలక్ష్మీ వ్రతం టికెట్లు

గోవింద మొబైల్‌ యాప్‌లోనూ వరలక్ష్మీ వ్రతం టికెట్లు

తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో ఈనెల 31న నిర్వహిస్తున్నవరలక్ష్మీ వత్రం  ఆన్‌లౌన్‌ టికెట్లను గోవింద మొబైల్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పర్చువల్‌ విధానంలో వరలక్ష్మీ  వ్రతం జరుగుతుందని పేర్కొన్నారు.  గోవింద మొబైల్‌ యాప్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని సూచించారు.  వర్చువల్‌ సేవకు ఆన్‌లైన్‌లో భక్తుల నుంచి విశేష స్పందన వస్తుందని అధికారులు అన్నారు.

అనేక మంది భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు నమోదు చేసుకున్నారని వివరించారు. ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు పోస్టల్‌ శాఖ ద్వారా పూజాసామగ్రిని పంపిణీ చేశామన్నారు. వరలక్ష్మీవ్రతం టికెట్లు పొందిన భక్తులకు అందించే ప్రసాదాలకు సోమవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చీ‌ఫ్‌ ఇంజినీర్‌ ఎం. రమేశ్‌రెడ్డి ఆలయ అర్చకులతో కలిసి పూజాసామగ్రిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం వాటిని అమ్మవారి మూలవిరాట్టు పాదాల వద్ద ఉత్తరీయం, రవిక, తదితర పూజా సామగ్రి ఉంచి పూజలు చేశారు.

వీటిని పంపిణీ చేసేందుకు పోస్టల్‌ శాఖకు అప్పగించారు. ఈనెల 31న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం  12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo