మంగళవారం 11 ఆగస్టు 2020
Devotional - Jul 21, 2020 , 11:52:28

31న పద్మావతి ఆలయంలో వరలక్ష్మీవ్రతం

31న పద్మావతి ఆలయంలో వరలక్ష్మీవ్రతం

తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 31న వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ జేఈవో పి.బసంత్‌కుమార్‌ తెలిపారు. భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్‌ ద్వారా ఇంటి నుంచే వ్రతంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఏడాది పవిత్రమైన శ్రావణ మాసంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని 31న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వర్చువల్‌ చేయాలని టీటీడీ నిర్ణయించిందని వివరించారు.

దేశ, విదేశాలల్లోని భక్తులు అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఈ వ్రతాన్ని తమ తమ నివాస ప్రాంతాల నుంచి ఎస్పీబీసీ ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించి పాల్గొనే అవకాశం టీటీడీ కల్పిస్తుందని వెల్లడించారు. వరలక్ష్మీవ్రతం టికెట్లు ఈ నెల 22 సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ వరకు టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని సూచించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo