మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Devotional - Aug 12, 2020 , 08:41:02

ఆగస్టు 16 నుంచి శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర

ఆగస్టు 16 నుంచి శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర

జమ్మూకాశ్మీర్‌ : కరోనా మహమ్మారి కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర దాదాపు నాలుగు నెలల తర్వాత తిరిగి ప్రారంభిస్తున్నట్లు వైష్ణోదేవి దేవస్థానం ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తర్వాతి రోజు 16వ తేదీ నుంచి కేంద్ర భూభాగంలోని మతపరమైన ప్రదేశాలను తెరవాలని నిర్ణయించింది. ధార్మిక స్థలాలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున.. భక్తుల కోసం తిరిగి ఆలయాన్ని తెరిచేందుకు ముందు కొవిడ్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని ఆలయ బోర్డు సీనియర్‌ అధికారి తెలిపారు.  గర్భగుడి, జంట పట్టాలపై, కత్రా పట్టణంలో కూడా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. యాత్ర పార్చీ కౌంటర్ వెలుపల, భవన్, సంజీచాత్, కత్రా వద్ద రెండు హెలీప్యాడ్‌ల వద్ద సామాజిక దూరం పాటించేలా సర్కిళ్లు ఏర్పాటు చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 18 నుంచి వైష్ణోదేవి తీర్థయాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు. తర్వాత, జూన్ 8 నుంచి మతపరమైన ప్రదేశాలను తిరిగి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. కానీ కొవిడ్‌-19 కేసులు అకస్మాత్తుగా పెరగడంతో మళ్లీ ఆలయాన్ని మూసివేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo